
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని సినీ పరిశ్రమకు చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని నంది నగర్‌లో నివాసం ఉంటున్న మహిళ సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తోంది.
2018 లో ఆమెకు సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్‌గా పని చేస్తున్న మన్మధ రావు అలియాస్ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. మన్మథ రావు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో తాను ఇప్పటికే రేప్ కేసులో బాధితురాలిగా ఉన్నానని, తనకు కొద్ది రోజులు గడువు కావాలని కోరింది. ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒకటయ్యారు.
గత ఏడాది ఆగస్టులో తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా, మహేష్ ఆమెను దూరంగా పెడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ సైతం బ్లాక్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణానగర్‌లో కనిపించిన మన్మథ రావును పెళ్లి విషయమై ప్రశ్నించగా ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (ఆరు నెలల క్రితమే పెళ్లి.. పక్కింటి కుర్రాడితో మాట కలిపి..)
Comments
Please login to add a commentAdd a comment