కామారెడ్డి క్రైం: ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలు చేయ డం మొదలుపెట్టి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా బుద్ధి మారలేదు. సెలవుపై ఇంటికి వచి్చన అతను మళ్లీ చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఎస్పీ శ్వేత సోమవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు.
వ్యసనాలకు అలవాటు పడి..
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన షేక్ సోహైల్ 2015 నుంచి ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నా డు. దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేం ద్రకాలనీ, భిక్కనూరు పరిధిలోని జంగంపల్లి, మాచారెడ్డి పరిధిలోని ఇళ్లలో చోరీలు చేశాడు. జిల్లా లో జరిగిన 3 చోరీ కేసుల్లో 3.50 తులాల బంగా రం, 130 తులాల వెండి ఆభరణాలు, రూ.21 వేల నగదు అపహరించాడు. అనుమానా స్పదంగా తిరుగుతున్న సోహెల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది. నిందితుడిపై గతంలో ఓ దోపిడీ కేసు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసు విషయంలో ఆర్మీకి సమాచారం ఉందా, లేదా అనే దానిపై స్పష్టత లేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment