aressted
-
నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా హరిహరకృష్ణ ప్రియురాలు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం హరిహరకృష్ణకు ప్రియురాలు డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ‘‘నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్‌కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికతో పాటు హసన్‌ను రిమాండ్‌కు తరలించాం’’ అని డీసీపీ వెల్లడించారు. ‘‘హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్ఫర్ చేసింది. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారు. నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. చదవండి: నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ -
సీఎంను చంపేస్తానంటూ వార్నింగ్.. పోలీసుల ఎంట్రీ.. చివరకు..
ఐజ్వాల్: ఏకంగా ముఖ్యమంత్రినే చంపేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్ప్డడ్డాడు ఓ వ్యక్తి. మూడు నెలల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. సీఎంను చంపేందుకు ఇప్పటికే ఓ స్పెషలిస్ట్ షూటర్‌ను సైతం రెడీ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. తీరా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరెస్ట్ అయ్యాడు. వివరాల ప్రకారం.. మూడు నెలల్లో రాజీనామా చేయకపోతే చంపేస్తానంటూ మిజోరం సీఎం జొరాంథంగాపై ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్‌తో ఇలా పోస్టులు పెట్టాడు. బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టి.. సదరు వ్యక్తిని ఖాజ్వల్ ప్రాంతానికి చెందిన రోడిన్లియానా అలియాస్ అపుయా టోచ్ఛాంగ్గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు ఐజ్వాల్‌లోని ఛాన్మరీ ప్రాంతంలో నివాసం ఉంటుండుగా.. తింగ్ట్లాంగ్ పా అనే నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా బెదిరింపులకు పాల్పడి వివిధ ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ముఖ్యమంత్రి జొరాంథంగా రాష్ట్ర బడ్జెట్‌ను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నాడని పోలీసులు వెల్లడిస్తూ ఈ కారణంగానే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా సదరు నిందితుడు 2018లో కూడా అప్పటి ముఖ్యమంత్రి లాల్ తన్హావాలాకు లేఖ రాసి ఆయనను కూడా చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు కూడా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, కర్నూలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లె పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ నేతల దాడి ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి -
లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు
జహీరాబాద్: మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరి నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ గణపత్ జాదవ్ తెలిపారు. గురువారం కేసు వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 11న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులైన ఒంగోలు జిల్లా కొమురోలు మండలం ఎడమాకుల గ్రామానికి చెందిన బండి పవన్‌కుమార్ (29), కాజీపేట పట్టణం దర్గా ఫాతిమానగర్‌కు చెందిన బ్రహ్మచారి (38)లను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చారు. పవన్‌కుమార్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఉప్పల్‌లో సిర్థపడిన ఖాజిపేటకు చెందిన బ్రహ్మచారిపై పలు కేసులు ఉన్నాయి. గతంలో ఓ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సోమాచారి (45) బుధవారం రాయికోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేసులో ఏ–1 నిందితుడు పవన్‌కుమార్‌ను గంగ్వార్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా విషయాన్ని గమనించి తమ వెంట తెచ్చుకున్న కారులో బ్రహ్మచారి, సోమచారిలు రాయికోడ్ వైపు పరారయ్యారు. కారును వేగంగా నడపడంతో బోల్తా పడి సోమాచారి అక్కడికక్కడే మరణించగా బ్రహ్మచారి గాయపడ్డాడు. దీంతో బ్రహ్మచారికి ఆస్పత్రిలో చికిత్స అందించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ సైదేశ్వర్, ఎస్ఐ వెంకటేశ్ పాల్గొన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మరణించిన సోమాచారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. -
సెలవులపై వచ్చి చోరీలు
కామారెడ్డి క్రైం: ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలు చేయ డం మొదలుపెట్టి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా బుద్ధి మారలేదు. సెలవుపై ఇంటికి వచి్చన అతను మళ్లీ చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఎస్పీ శ్వేత సోమవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు అలవాటు పడి.. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన షేక్ సోహైల్ 2015 నుంచి ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నా డు. దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేం ద్రకాలనీ, భిక్కనూరు పరిధిలోని జంగంపల్లి, మాచారెడ్డి పరిధిలోని ఇళ్లలో చోరీలు చేశాడు. జిల్లా లో జరిగిన 3 చోరీ కేసుల్లో 3.50 తులాల బంగా రం, 130 తులాల వెండి ఆభరణాలు, రూ.21 వేల నగదు అపహరించాడు. అనుమానా స్పదంగా తిరుగుతున్న సోహెల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది. నిందితుడిపై గతంలో ఓ దోపిడీ కేసు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసు విషయంలో ఆర్మీకి సమాచారం ఉందా, లేదా అనే దానిపై స్పష్టత లేదని వెల్లడించారు. -
పశ్చిమగోదావరిలో విదేశీయుడి అరెస్ట్
సాక్షి, జంగారెడ్డిగూడెం: పాస్‌పోర్టు లేకుండా అనుమానాస్పదంగా సంచరిస్తున్న విదేశీయుడిని సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ ఇస్లాం అనుమానాస్పదంగా సంచరించడంతో లక్కవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని వద్ద పాస్‌పార్టు కూడా లేకపోవడంతో కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్‌కు ముందు హాజరు పరిచారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు. మహ్మద్ ఇస్లాం ఎందుకు వచ్చాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
కార్యాలయం ఉద్యోగులే దొంగలు!
సాక్షి, ఒంగోలు : కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులే ఆ సంస్థలో వస్తువులను కాజేశారు. ఈ సంఘటన స్థానిక ఏనుగుచెట్టు సమీపంలోని డీటీడీసీ కార్యాలయంలో వెలుగు చూసింది. ఒన్‌టౌన్ సీఐ ఎం.భీమానాయక్ కేసు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరు పరిచారు. సీఐ కథనం ప్రకారం.. డీటీడీసీ కార్యాలయం నిర్వాహకుడు జొన్నగలగడ్డ శ్రీనివాసరావు ఇటీవల పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. డెలివరీ చేయాల్సిన పార్శిల్ వస్తువులు చోరీ అయ్యాయనేది ఆ ఫిర్యాదు సారాంశం. చోరీ సొత్తు విలువ రూ.4 లక్షలు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ముందుగా డీటీడీసీ కార్యాలయంలోని సీసీ పుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో లభించిన సమాచారం ఆధారంగా రాత్రి వేళ కార్యాలయంలో విధుల్లో పనిచేసిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిఘా ఉంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అయినాబత్తిన చిరంజీవి, అతడిచ్చిన సమాచారంతో అదే కార్యాలయంలో పనిచేసే కాకా మణికంటేశ్వరరావులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వివిధ కంపెనీలకు చెందిన 11 మొబైల్ ఫోన్లు, వైర్లెస్ స్పీకర్–1, సన్ గ్లాసెస్–1, బైక్ హారన్–1, రిస్ట్వాచి–1 స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలుగా నిర్థారించారు. ఈ కేసులో మరో నిందితుడు హరిప్రసాద్ అలియాస్ హరి కోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ఎస్ఐ నఫీజ్ బాషా, సిబ్బంది కృషి చేశారంటూ వారిని సీఐ భీమానాయక్ అభినందించారు. -
ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య
సాక్షి, చేబ్రోలు: దళిత నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఎమ్మార్పీఎస్ మాజీ నేత, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పమిడిపాటి కోటయ్య హత్యకు ప్రధాన కారణమని చేబ్రోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ శ్రీనివాసరావు తెలిపారు. మండలకేంద్రలోని సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూలై 5వ తేదీ రాత్రి చేబ్రోలు మండల పరిధిలోని వేజండ్ల పల్లె అడ్డరోడ్డు దగ్గర అమృతలూరు ప్రాంతానికి చెందిన పమిడిపాటి కోటయ్య హత్యకు గురయ్యాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు, తెనాలి ఐతానగర్‌కు చెందిన కొత్తపల్లి నాగరాజు, కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి రాజేంద్ర, కూచిపూడి మోహన్, సుద్దపల్లి కిషోర్‌లు కోటయ్య హత్యకు కారకులని వెల్లడించారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు పమిడిపాటి కోటయ్య, తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు గతంలో ఎమ్మార్పీఎస్‌లో పనిచేశారు. కోటయ్యను ఎమ్మార్పీఎస్ నుంచి తొలగించిన తరువాత వీరిద్దరికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోటయ్య ఫేస్బుక్, వాట్సప్‌లలో పీక కోస్తానని, చంపుతానని పోస్టులు పెట్టడంతో ఎక్కడ తనను చంపుతాడోనని భావించి ముందుగానే నాగరాజు కోటయ్యను చంపాలని నిర్ణయించుకొని మరి కొంత మంది సహకారంతో పథకం ప్రకారం హత్య చేశాడు. కోటయ్య కదలికలను గమనించి స్కార్పియాతో ఢీ కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. సీఐతో పాటు స్థానిక ఎస్ఐ సీహెచ్ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
సాక్షి,ధర్మసాగర్: ఈ నెల 9న వేలేరు శివారులో జరిగిన దారుణహత్య కేసును పోలీసులు చేధించారు. మంగళవారం ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చూపారు. కాజీపేట ఏసీపీ నర్సింగ్‌రావు కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి పెద్దరబోయిన రాజకొమురయ్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు స్వప్న ఇదే గ్రామానికి చెందిన మేడబోయిన మహేందర్ ను 13 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే వారి ఇరువురి మధ్య గొడవులు జరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా కేసులు సైతం నమోదై ఉన్నాయి. ఈ క్రమంలోనే 15 నెలల క్రితం రాజకొమురయ్య భార్య మృతి చెందటంతో, తిరిగి వీరి మధ్య సంబంధాలు మదలయ్యాయి. దీంతో పెద్ద కూతురుకు తన వ్యవసాయ భూమిలో ఒక ఎకరం ఇస్తానని మాట ఇచ్చారు. ఇదే విషయంపై మృతుడి భార్య సంవత్సరికం సందర్భంగా మామ రాజకొమురయ్యను, అల్లుడైన మహేందర్ నిదీశాడు. దీంతో అల్లుడిపై ఆగ్రహంతో నేను మరో వివాహం చేసుకుంటానని, ఎవరికి తన ఆస్తిలో నుంచి వాటా ఇవ్వనని ఘటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో తన మామ బతికి ఉంటే భూమి దక్కదని తలచిన అతడి ఎలాగైన హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ఇదే విషయమై గ్రామానికి చెందిన తన స్నేహితులైన ముప్పిడి నాగరాజు, పుట్ట వేణులకు తెలిపి, తన మామ హత్యకు సహరిస్తే చెరొక లక్ష రూపాయలు ఇస్తానని వారి ఒప్పించాడు. అనంతరం సమయం కోసం వేచి చూసి ఈ నెల 8వ తేదీ న హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. మరుసటి రోజున తన చిన్న కూతురు బంధువుల ఇంటికి సైదాపూర్ మండలం అగ్రహా రం గ్రామానికి ఓ ఫంక్షన్ వెళ్లి తిరిగి టీవీఎస్ మోపెడ్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే ఫంక్షన్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న మహేందర్, నాగరాజు, వేణులు ముల్కనూరు నుంచి అతడిని మరొక బైక్‌పై వెంబడించారు. హవల్థారుపల్లి, ఎర్రబెల్లి గ్రామాల మధ్యన మనుషుల సంచారం లేకపోవటంతో వారి బైక్‌తో మృతుడు ప్రయాణిస్తున్న మోపెడ్‌ను ఢీ కొట్టి అతడు కింద పడటంతో వెంట తెచ్చుకున్న వేట కొడవలి, దుడ్డు కర్రలతో విషక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కాగా మృతుడి చిన్న కూతురు గూళ్ల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ధర్మసాగర్ ఇన్‌ఛార్జి ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, వేలేరు ఎస్సై ఈ.వీరభద్రరావులు ఆధారాలకు సేకరించి హత్య కేసును పలు కోణాల్లో విచారించి హత్య చేసిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేట కొడవలి, దుడ్డు కర్రలను స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌జీ, వేలేరు ఎస్సై ఈ. వీరభద్రరావులను ఏసీపీ నర్సింగ్‌రావు అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై వి.విజయ్‌రాంకుమార్, ఎఎస్సై ఉమాకాంత్, హెచ్‌సీలు సహదేవ్, కాంతరావు, పీసీలు రవిరాజ్ పాల్గొన్నారు. -
నకిలీ మావోయిస్టుల ఆటకట్టు
సాక్షి, విజయనగరం: జిల్లాలోని సాలూరు నియోజకవర్గ గిరిజన ఏజెన్సీ గ్రామాల్లో నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ నలుగురు నకిలీ మావోయిస్టులను సాలూరు పోలీసులు పట్టుకున్నారు. సాలూరు సర్కిల్ పరిధిలో పోలీసులు ఒక బృందంగా ఏర్పడి పకడ్బంది వ్యూహంతో మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది కాలంగా నలుగురు వ్యక్తులు తాగుడు, చెడు వ్యసనాలకు బానిసై.. గ్రామాల్లో డబ్బు పలుకుబడి ఉన్న వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. వీళ్లు గత రెండు నెలలుగా చిట్టినాయుడు, ఎల్ఐసీ ఏజెంట్ గౌరినాయుడిని బెదిరించి వారి నుంచి సుమారు ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు. రెండు రోజుల నుంచి చెముడు గ్రామానికి చెందిన రామానాయుడు అనే వ్యక్తికి కూడా ఫోన్ కాల్స్ చేస్తూ.. తాము నక్సలైట్లమంటూ డబ్బులు ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే అంతు తేలుస్తాం అంటూ బెదిరించారు. రామానాయుడు ముందస్తుగా రూ.లక్షా 35 ఐదు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. పాచిపెంట మండలం పారమ్మకొండ చెరుకుపల్లి బస్టాప్ వద్ద రహస్య ప్రదేశంలోకి వచ్చి డబ్బు ఇవ్వాలని సూచించారు. అతడు పోలీసులకు సమాచారం అందిచడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. లక్షా 50 వేలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు వైద్య వరప్రసాద్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వరప్రసాద్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనల ప్రకారం 48 గంటలపాటు ప్రభుత్వ ఉద్యోగి జైల్లో ఉంటే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయవచ్చు. వరప్రసాద్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. సోమవారం హైకోర్టు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. వరప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ హైకోర్టుకు నాలుగు నెలల క్రితం ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరపాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు వరప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడిబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు. ప్రధాన న్యాయమూర్తి వాటిని పరిశీలించి వరప్రసాద్‌పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీకి అనుమతినిచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు వరప్రసాద్‌పై ఈ నెల 13వ తేదీన కేసు నమోదు చేసి, 14న హైదరాబాద్, సిరిసిల్ల, మహారాష్ట్రలలో ఉన్న ఆయన ఇళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాత్రి వరకు తనిఖీలు కొనసాగించిన అధికారులు వరప్రసాద్‌కు రూ. 1.50 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 3 కోట్లుగా తేల్చారు. అనంతరం బుధవారం రాత్రి వరప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బినామీగా స్నేహితుడు.. తనిఖీల్లో లభించిన ఆధారాలతో వరప్రసాద్ ఆస్తులకు ఆయన స్నేహితుడు సుదర్శన్ బినామీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో ఉన్న సుదర్శన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వరప్రసాద్ రెండు సార్లు అమెరికా వెళ్లడంతోపాటు చైనా, హాంకాంగ్, మలేసియా, మకావు, సింగపూర్ దేశాలకు కుటుంబ సభ్యులతో వెళ్లారని, ఇందుకు రూ.లక్షల రూపాయలు వెచ్చించారని ఏసీబీ అధికారులు తెలిపారు. కొండాపూర్‌లోని ఇంటిని కూడా విలాసవంతంగా నిర్మించి రూ.లక్షల విలువ చేసే రిక్లయినర్ కుర్చీలు, ఏసీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. -
కొట్టేసినా... కొనేవారు లేక!
సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంతో సౌదీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు... డిపోర్టేషన్‌పై రావడంతో మళ్లీ వెళ్లే అవకాశం పోయింది. కుటుంబసమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో నిజాం మ్యూజియంపై కన్నుపడింది... నేరచరితు డైన స్నేహితుడితో కలసి చోరీ చేశాడు.. రూ.300 కోట్ల విలువైన పురాతన వస్తువులు కొట్టేసినా ఎవరికి? ఎక్కడ అమ్మాలో తెలియలేదు. దీంతో భూమిలో పాతిపెట్టి ‘బేరాల కోసం’ముంబై వెళ్లారు. ఈ తతంగం ఇలా సాగుతుండగానే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్(హెచ్‌ఈహెచ్) నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన దొంగల వ్యవహారమిది. ఈ నెల 4న జరిగిన ఈ చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం తెలిపారు. ఆస్పత్రి రద్దీగా ఉండటంతో.. రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ మొబిన్ 2015లో సౌదీ వెళ్లి వెల్డర్‌గా పని చేసేవాడు. అక్కడ రెండున్నర నెలల క్రితం ఓ పాకిస్తానీపై చేయి చేసుకున్నాడు. దీంతో అరెస్టయి, శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత అధికారులు బలవంతంగా భారత్‌కు తిప్పి (డిపోర్టేషన్) పంపారు. మళ్లీ సౌదీ వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించాడు. అనారోగ్య కారణాలతో జూలై చివరి వారంలో మస్రత్ మహల్ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో టోకెన్ తీసుకున్న మొబిన్ కాలక్షేపానికి దగ్గరలో ఉన్న నిజాం మ్యూజియానికి వెళ్లాడు. అరకొర భద్రత ఉండటంతో పాటు అందు లో ఉన్న బంగారం టిఫిన్ బాక్స్, కప్పు, సాసర్, టీ స్పూన్లు, బంగారం పొదిగిన ఖురాన్ అత డిని ఆకర్షించాయి. సౌదీ జైల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ నేరగాళ్లతో పరిచయమైంది. దీంతో ఈ వస్తువుల్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. 35 రోజుల ముందే మార్కింగ్... రాజేంద్రనగర్కే చెందిన సెంట్రింగ్ వర్కర్ మహ్మద్ గౌస్ పాషాకు నేరచరిత్ర ఉంది. ఇప్పటివరకు 25 నేరాలు చేశాడు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కావడంతో మొబిన్ తన ఆలోచనను ఇతడికి చెప్పాడు. దీంతో చోరీ చేద్దామని నిర్ణయించుకున్న ఇద్దరూ ఆగస్టు మొదటి వారంలో మ్యూజి యంను సందర్శించారు. ఆద్యంతం రెక్కీ చేశా రు. మరో రోజు వచ్చి ఏ వెంటిలేటర్ నుంచి లోపలికి దిగాలో నిర్ణయించుకుని మూడు చోట్ల ‘యారో’, ‘స్టార్’మార్కింగ్ చేశారు. మ్యూజియంలో సీసీ కెమెరాలు ఉండటం, వీటిలో రికార్డయిన ఫుటేజ్ 30 రోజుల పాటు స్టోరేజ్ ఉంటుందనే విషయం తెలియడంతో.. గౌస్ చోరీని నెల తర్వాత చేద్దామంటూ మొబి న్కు చెప్పాడు. అలా కాకుంటే చోరీ తర్వాత పోలీసులు సందర్శకుల విజువల్స్ పరిశీలిస్తే చిక్కుతామని అంతకాలం ఆగారు. చివరకు ఈ నెల 3న ద్విచక్ర వాహనంపై మ్యూజియం వద్దకు చేరుకున్నారు. పట్టుకుంది గౌస్... దిగింది మొబిన్ గౌస్ తన సిమ్‌కార్డును ఇంట్లోనే వదిలి సెల్‌ఫోన్ తీసుకువచ్చాడు. వెనుక ఉన్న మసీదు సమీపం నుంచి మ్యూజియం పైకి ప్రవేశించిన ఇద్దరూ ముందే పెట్టుకున్న మార్కింగ్‌లను సెల్లో ఉన్న టార్చ్ సాయంతో గుర్తించారు. వెంటిలేటర్‌పై ఉన్న గ్లాస్, గ్రిల్స్ తొలగించిన తర్వాత తాడు ను గౌస్ లోపలకు వదిలాడు. దీని సాయంతో మొబిన్ లోపలకు దిగాడు. అల్మారా పగులకొట్టి టిఫిన్ బాక్స్, కప్పు సాసర్, స్పూన్ తస్కరించి బ్యాగ్‌లో సర్దుకున్నాడు. మరో గదిలో ఉన్న ‘బంగారు ఖురాన్’ దగ్గరకు వెళ్లేసరికి మసీదులో సైరన్ మోగింది. దీంతో మొబిన్ వెనక్కు వచ్చాడు. ఇద్దరూ వాహనంపై పరారయ్యారు. ముంబై హైవే ద్వారా ముత్తంగి వరకు వెళ్లి... ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్ ద్వారా తిరిగి వచ్చారు. రాజేంద్రనగర్ ఫామ్‌హౌస్ సమీపంలో వస్తువుల్ని పాతిపెట్టారు. నిజాం వస్తువులు వాడిన ఇరువురూ... ముంబై వెళ్లి వచ్చిన తర్వాత ఆ వస్తువుల్ని తవ్వి తీసిన గౌస్, మొబిన్ తమ ఇళ్లకు తీసుకువెళ్లి వినియోగించారు. వీరి కోసం గాలిస్తున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి సమాచారం అందింది. దీంతో మంగళవారం ఉదయం దాడి చేసి ఇద్దరినీ పట్టుకోవడంతోపాటు బంగారం టిఫిన్ బాక్స్, టీకప్పు, సాసర్, స్పూన్ స్వాధీనం చేసుకున్నారు. చోరీ నేపథ్యంలో టిఫిన్ బాక్స్‌పై ఉన్న విలువైన వజ్రాలు, రాళ్లు కొన్ని ఊడిపోవడంతో వాటినీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించారు. దేశంలోనే మ్యూజియంలో జరిగిన భారీ చోరీ ఇదేనని, ఈ తరహా చోరీ ఇంత త్వరగా కొలిక్కి రావడం, సొత్తు మొత్తం రికవరీ కావడం ఇప్పటివరకు జరుగలేదని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
సిరిసిల్లక్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోరీ ల్లో నిందితుడిగా ఉన్న అంతర్జిల్లా దొంగను ఆది వారం రాజన్న సిరిసిల్ల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ నరహరి వివరాలు వెల్లడించారు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామావత్ శంకర్ గతేడాది జన వరి నుంచి ఇప్పటి వరకు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో ఆరు దొంగతనాలు, గంభీరావుపే ట మండలంలో రెండు దొంగతనాలు చేశాడు. వేములవాడలోని ఒక షాపులో చోరీచేసే ప్రయత్నంలో పోలీస్ జీపు అటువైపుగా వెళ్లడాన్ని గమనించి పరారయ్యాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం సిరిసిల్ల పాతబస్టాండ్‌లో పట్టుకున్నారు. దొంగను అరెస్టు చేసిన సీసీఎస్ సీఐ బన్సీలాల్, ముస్తాబాద్ ఎస్సై ప్రవీణ్, సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్, సీసీఎస్ ఎస్సై ఉపేందర్‌ను డీఎస్పీ నరహరి అభినందించారు. గల్ఫ్ ఏజెంట్...p సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటలో గల్ఫ్ పంపిస్తానని మోసం చేసేందుకు ప్రయత్నించిన నకిలీ ఏజెంట్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టుచేశారు. మాదం కరుణాకర్ ఎలా ంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంటుగా చలామణి అవుతున్నాడు. అతడివద్ద నుంచి ఏడు పాస్‌పోర్టులు, నాలు గు చెక్కులు, మెడికల్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
రూ.2.23 లక్షల బంగారం స్వాధీనం వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఇద్ద రు నిందితులను సిటీ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.2.23 లక్షల విలువ చేసే 82.250 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నింది తుల వివరాలను సీసీఎస్ సీఐ శ్రీధర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ ఇమ్రాన్, మహారాష్ట్ర హింగన్‌ఘాట్ గోమాజీగూడకు చెందిన సయ్యద్ అక్బర్ దగ్గరి బంధువులు కావడంతో వంట పను లు చేసుకుంటూ విజయవాడలో జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఇద్దరు 2013లో మొదటిసారి దొంగతనానికి పాల్పడ్డారు. మళ్లీ 2015లో ఖమ్మం టూటౌన్ పరిధిలో దొంగతనానికి పాల్పడడంతో పోలీసులకు చిక్కడంతో షేక్‌ఇమ్రాన్ జైలు పాలయ్యాడు. ఈ ఏడాది జైలు నుంచి విడుదలైన ఇమ్రాన్ మళ్లీ అక్బర్‌తో కలసి వరంగల్ కమిషనరేట్ పరిధిలో రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. జనవరిలో హైదరాబాద్‌కు వెళుతు న్న మహిళ నుంచి 55 గ్రాముల బంగారు నగలు, జులైలో వర్ధన్నపేట మండలం కక్కిరాలపల్లిలో తాళం వేసిన ఇంటి నుం చి 27.250 గ్రాముల బంగారం దొం గిలించారు. చోరీ చేసిన ఆభరణాలను ఆమ్మేందుకు విజయవాడ నుంచి ఇద్దరు వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా సమాచారంతో క్రైం ఏసీపీ ఈశ్వర్రావు ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్లు సీఐ శ్రీధర్ వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసిన సీఐతోపాటు ఎస్సై సుమన్, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మున్నా, రవికుమార్, జంపయ్యను సీపీ సుధీర్‌బాబు అభినందించారు.