
సాక్షి, జంగారెడ్డిగూడెం: పాస్‌పోర్టు లేకుండా అనుమానాస్పదంగా సంచరిస్తున్న విదేశీయుడిని సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ ఇస్లాం అనుమానాస్పదంగా సంచరించడంతో లక్కవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని వద్ద పాస్‌పార్టు కూడా లేకపోవడంతో కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్‌కు ముందు హాజరు పరిచారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు. మహ్మద్ ఇస్లాం ఎందుకు వచ్చాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment