సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం మాత్రం చెప్పడం లేదు.
గన్నవరం వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పీఎస్ వద్ద పోలీస్ అంక్షలు విధించారు. స్టేషనలోకి ఎవరూ వెళ్లకుకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గన్నవరానికి చెందిన 10 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు కేసులు పెట్టినంత మాత్రాన బెదిరిపోమని లోకేష్ గుర్తుంచుకోవాలి. రెడ్ బ్యాంక్ రాజ్యాంగాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే మీకు ప్రజలు చరమగీతం పలుకుతారు. మీకు చేతనైంది.. చేసుకోండి. దానికి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు’’ అంటూ దేవభక్తుని చక్రవర్తి హెచ్చరించారు.
తెల్లవారుజామున 5 గంటలకు మా నాన్నను అరెస్ట్ చేశారు. ఏదో గ్యాంగ్ స్టర్‌ను అరెస్ట్ చేసినట్లు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అనగాని రవి కుమారుడు ధ్వజమెత్తారు. 45 ఏళ్లుగా మా తాత, మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఇంత కక్షపూరిత.. దౌర్జన్య వైఖరి ఎప్పుడూ లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై కంటే అభివృద్దిపై దృష్టి పెడితే బాగుంటుంది. ఏ కేసు పెట్టారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం కోసం కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. అరెస్టులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని ఆయన అన్నారు.
కనీస సమాచారం లేకుండా తెల్లవారు జామున అక్రమంగా అరెస్ట్ చేశారని.. అనగాని రవికి ఆరోగ్యసమస్యలున్నాయని అనగాని రవి మేనకోడలు అన్నారు. మందులు ఇవ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోవడం లేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment