
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం హరిహరకృష్ణకు ప్రియురాలు డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్‌బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ‘‘నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్‌కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికతో పాటు హసన్‌ను రిమాండ్‌కు తరలించాం’’ అని డీసీపీ వెల్లడించారు.
‘‘హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్‌ఫర్ చేసింది. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారు. నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు.
చదవండి: నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్‌స్ట్రక్షన్
Comments
Please login to add a commentAdd a comment