జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీలో (సీఎఫ్‌ఎన్) విధులు నిర్వహిస్తున్న జయపాల్‌రెడ్డి (34) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ముదిగుబ్బ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీలో (సీఎఫ్‌ఎన్) విధులు నిర్వహిస్తున్న జయపాల్‌రెడ్డి (34) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గంగిరెడ్డిపల్లికి చెందిన జయపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు పదేళ్ల క్రితం ముదిగుబ్బకు వచ్చి స్థిరపడ్డారు. జయపాల్‌రెడ్డి 2004లో ఆర్మీలో చేరాడు. ఇటీవల వినాయక చవితి పండుగకు సెలవుపై ముదిగుబ్బకు వచ్చాడు. మూడు రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లి విధులలో చేరాడు. అయితే అక్కడ ఏమి జరిగిందో తెలియదు కానీ జయపాల్‌రెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మి, కూతుర్లు నవ్యశ్రీ, చరిత ఉన్నారు.