ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీ పరిధి ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఆరెం అంజయ్య(26) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీ పరిధి ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఆరెం అంజయ్య(26) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్న ఆయన వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అంజయ్య రెండేళ్ల క్రితం ఆర్మీకి ఎంపికయ్యాడు. మూడు నెలల క్రితం ఇంటికి వచ్చిన ఆయన తిరిగి వెళ్లలేదు. అరుుతే జవాను మరణానికి పూర్తి కారణాలు తెలియరాలేదు.