అత్తను గెంటేసిన కోడలు.. కొడుకును జవాను చాచి కొట్టడంతో.. | Viral: Army Jawan Slaps Man Who Left His Mother What Happens Next | Sakshi
Sakshi News home page

Viral: అత్తను గెంటేసిన కోడలు.. కొడుకును జవాను చాచి కొట్టడంతో..

Published Fri, Aug 27 2021 8:03 PM | Last Updated on Fri, Aug 27 2021 9:15 PM

Viral: Army Jawan Slaps Man Who Left His Mother What Happens Next - Sakshi

న్యూఢిల్లీ: నవమాసాలు మోసిన తల్లిని నడవలేని స్థితిలో వదిలేయాలనుకున్నాడు ఓ కొడుకు. కన్నతల్లి అనే కనికరం లేకుండా కట్టుకున్న భార్యతో ఇంటి నుంచి గెంటించాలనుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆర్మీ జవాను.. ఆ కొడుకుకు బుద్ధిచెప్పి అవ్వను ఇంటికి చేర్చాడు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తనను ఇంటి నుంచి పంపించవద్దంటూ ఆ మాతృమూర్తి కోడలి కాళ్లపై పడుతున్నా ఆమె వినిపించుకోలేదు. కొడుకేమో తీరిగ్గా ఓ చోట కూర్చుని జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ సైనికుడు.. విషయమేంటని వారిని అడిగారు. అయితే, అప్పటిదాకా చోద్యం చూస్తున్న కొడుకు.. ‘‘మా గురించి నీకెందుకు’’ అన్నట్లుగా జవానును తోసెయ్యబోయాడు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో అతడి చెంప పగుళగొట్టాడు జవాను. 

అయితే, ఆ తల్లి మాత్రం తన కొడుకును కొట్టవద్దంటూ బతిమిలాడింది. సైనికుడు గట్టిగా బుద్ధి చెప్పడంతో దిగొచ్చిన ఆమె కొడుకు తల్లిని తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘మీరందరూ మేం కాపాడుకునే ప్రాణాలురా.. ఇలా అయితే ఎలా’’ అంటూ జవాను అతడికి బాగానే బుద్ధి చెప్పాడని కామెంట్లు చేస్తున్నారు. సరిలేవరు మీకెవ్వరు అంటూ ఇటు తల్లి ప్రేమకు, అటు సైనికుడి గొప్పతనానికి జై కొడుతున్నారు.

చదవండి: పెళ్లి దుస్తుల్లోనే వధూవరుల పుష్‌ అప్స్‌.. వారెవ్వా!
Dancing Dadi: అదిరిపోయే స్టెప్పుల‌తో మాధురి దీక్షిత్‌ను దించేసిన బామ్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement