
పట్నా: మాస్క్ పెట్టుకోలేదని భారత జవాన్‌ని జార్ఖండ్ పోలీసులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన ఛాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఛాత్రా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ముగ్గురు పోలీసు సిబ్బందిని, మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. పోలీసులు చితకబాదిన జవాన్‌ను పవన్ కుమార్ యాదవ్‌గా గుర్తించారు.
వివరాల ప్రకారం.. ఓ ప్రాంతంలో పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఆరా-భూసాహి గ్రామానికి చెందిన యాదవ్ తన బైక్‌పై ఆ రూట్లో వెళ్తున్నాడు. మాస్క్ లేకపోవడంతో పోలీసులు యాదవ్‌ని అడ్డుకుని నిలదీశారు. ఈ క్రమంలో ఓ పోలీసు దురుసుగా బైక్ తాళాలు లాక్కోగా యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, జవాన్ మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో అక్కడున్న పోలీసులు అతడిని రౌండప్ చేసి కొట్టడమే కాకుండా కాలుతో కడుపులో తన్నారు. ఆశ్చర్యమేమంటే జవాన్‌ని కొడుతున్న పోలీసులకు కూడా మాస్క్ లేదు. చివరికి గ్రామస్థులు జోక్యం చేసుకోవడంతో జవాన్‌ను మయూర్‌హండ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు.
Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R
— VR (@vijayrampatrika) September 2, 2021
Comments
Please login to add a commentAdd a comment