బొబ్బిలి మండలం సీతానగరం గ్రామంలో ఆర్మీ జవాను పోల రామకృష్ణ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి.
విజయనగరం : బొబ్బిలి మండలం సీతానగరం గ్రామంలో ఆర్మీ జవాను పోల రామకృష్ణ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాలు ప్రభుత్వ లాంఛనాలతో రామకృష్ణ అంత్యక్రియలను నిర్వహించాయి. ఆర్మీ జవాను పోల రామకృష్ణ జమ్మూకాశ్మీర్‌లోని బస్తర్‌బాగ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఆ క్రమంలో దిల్‌బాగ్ అనే 7వేల మీటర్ల ఎత్తులోని ఉన్న పర్వతంపైకి 14 సైనికులతో కలిసి వెళ్లారు. అక్కడ రామకృష్ణ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తింది. ఆ క్రమంలో సహచరులు అతడిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.