నగరంలోని తిరుమలగిరిలో పదమూడేళ్ల మైనర్ బాలికపై ఓ ఆర్మీ జవాను అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో పదమూడేళ్ల మైనర్ బాలికపై ఓ ఆర్మీ జవాను అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆర్.కే.పురంలో నివాసం ఉండే పదమూడేళ్ల బాలిక స్థానికంగా ఉండే ఓ ఆర్మీ అధికారి వద్ద ఇంటి పనిచేస్తుంది. కాగా శనివారం రాత్రి పని ముగించుకుని, దారిలో ఓ దుకాణం వద్ద సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా.. సదరు ఆర్మీ అధికారి వద్దే విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాను ఆమెను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.
వెంటే ఉన్న ఆమె చెల్లెలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు
అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆర్మీజవాను పరారయ్యాడు. విషయం తెలుసుకుని.. బాలికను తీసుకుని ఆర్మీ అధికారి ఇంటికి చేరుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు కలిసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్యాచారయత్నానికి పాల్పడిన ఆ ఆర్మీ జవాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.