జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు | Hyderabad: Jubilee Hills Pub Case Minor Molestation Case Enquiry Corporator | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు

Published Sun, Jun 5 2022 9:22 PM | Last Updated on Sun, Jun 5 2022 9:50 PM

Hyderabad: Jubilee Hills Pub Case Minor Molestation Case Enquiry Corporator - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఆరోపణల నేపథ‍్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా బాలిక అత్యాచారం కేసులో మరో మలుపు తిరిగింది.

ఈ కేసుకు సంబంధించి ఓ ఎంఐఎం కార్పొరేటర్‌ని పోలీసులు విచారించనున్నారు. సదరు కార్పొరేటర్‌ని విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. గతంలో హైదరాబాద్ మాజీ మేయర్‌గా ఆ కార్పొరేటర్ సేవలందించారు. ఈ కేసులో నిందితులకు సహకారం చేశాడని కార్పొరేటర్‌పై పలు ఆరోపణలు వచ్చాయి.  కారులో మొయినాబాద్ వరుకు కార్పొరేటర్ వెళ్లినట్టు, నిందితులకు సహకరించినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు.

చదవండి: ఉత్తర ప్రదేశ్‌లో అమానుషం.. కస్టడీలో ఉన్న వ్యక్తికి కరెంట్‌ షాక్‌, లాఠీ దెబ్బలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement