సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం వార్త విని షాక్‌కు గురయ్యానని, తీవ్ర ఆగ్రహం కలిగిందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ సంఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారు ఎంత హోదాలో ఉన్నా, ఎలాంటివారితో అనుబంధమున్నా క్షమించరాదని స్పష్టం చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటాం...
కేటీఆర్ ట్వీట్‌కు హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సంఘటన దారుణమైనదని, దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా, ఎంత బలమైన వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని రీట్వీట్ చేశారు. వారిని త్వరగా అరెస్టు చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఇప్పటికే డీజీపీని, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Outraged & shocked with the news of the rape of a minor in Hyderabad
Request HM @mahmoodalitrs Garu @TelanganaDGP Garu and @CPHydCity to take immediate & stern action. Please don’t spare anyone involved irrespective of their statuses or affiliations
— KTR (@KTRTRS) June 3, 2022
Comments
Please login to add a commentAdd a comment