ముంబై: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. యువకుడు, మైనర్ రిలేషన్‌లో ఉన్నారని, వారి మధ్య ఏర్పడిన లైంగిక సంబంధం ప్రేమ కారణంగా కలిగినదే తప్ప.. కామం వల్ల కాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఊర్మిళ జోషి పార్కే తీర్పు వెల్లడించింది.
‘బాలిక మైనర్‌యే కావచ్చు. కానీ ఆమె తన ఇష్టం మేరకే ఇంటిని వదిలి నిందితుడు నితిన్ ధబేరావుతో కలిసి ఉంటున్నట్లు పోలీసులతో చెప్పింది. ధబేరావు వయసు కూడా 26 ఏళ్లు. వారి ఇద్దరు ప్రేమ వ్యవహారం కారణంగానే కలిసి ఉండాలని అనుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం వల్లే లైంగికంగా ఒకటయ్యారు. అంతేగానీ నిందితుడు ఆమెను కామంతో లైంగిక వేధింపులకు గురిచేయలేదు. ఆమెపై బలవంతంగా జరిగిన దాడి కాదు’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి ఆంక్షలతో కూడి బెయిల్ మంజూరు చేసింది.
కాగా 13 ఏళ్ల మైనర్ తన ఇంటి పక్కన నివసించే నితిన్ దామోదర్ ధబేరావ్‌ను ప్రేమించింది. 2020 ఆగస్టులో అతనితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొన్ని రోజులు ఇద్దరు ఒకచోట నివసించారు. బాలిక తండ్రి కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వెతికి పట్టుకున్నారు.
2020 ఆగస్టు 30న దామోదర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. అక్టోబర్‌లో అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ధబేరావ్‌తో ప్రేమించడం కారణంగానే.. తన ఇష్టపూర్వకంగా ఇంటిని వదిలి బయటకు వచ్చినట్లు బాలిక తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినట్లు పేర్కొంది. అతనితో కలిసి జీవించేందుకే తన ఇంట్లో నుంచి బంగారం, డబ్బులు దొంగిలించినట్లు వెల్లడించింది.
చదవండి: Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment