జవాన్‌ ఉమా మహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత | Dharmana Krishnadas Give 50 Lakh Ex Gratia Jawan Umamaheswara Rao Family | Sakshi
Sakshi News home page

జవాన్‌ ఉమా మహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత

Published Sat, Jul 17 2021 2:24 PM | Last Updated on Sat, Jul 17 2021 2:36 PM

Dharmana Krishnadas Give 50 Lakh Ex Gratia Jawan Umamaheswara Rao Family - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సరిహద్దులో విధి నిర్వహణలో మృతి చెందిన వీర జవాన్ లావేటి ఉమా మహేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.50లక్షల చెక్కును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లడూతూ ఆర్మీ జవాన్ ఉమా మహేశ్వరరావు మృతి తీరని లోటుని అన్నారు. ఆయన ప్రాణాలను ఫణంగా పెట్టి దెశాన్ని కాపాడారాని.. ప్రతి ఒక్కరూ వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రూ.50 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ద్వారా వారి కుటుంబానికి అందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement