జమ్మూ కాశ్మీర్‌లో పాముకాటుకు గురై మృతిచెందిన ఆర్మీ జవాను పూస కరుణాకర్ అంత్యక్రియలు అధికార లాంచనాలతో కరీంనగర్ జిల్లాలో నిర్వహించారు.
కమలాపూర్: జమ్మూ కాశ్మీర్‌లో పాముకాటుకు గురై మృతిచెందిన ఆర్మీ జవాను పూస కరుణాకర్ అంత్యక్రియలు అధికార లాంచనాలతో కరీంనగర్ జిల్లాలో నిర్వహించారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన అతన్ని ఈ నెల 10వ తేదీన పాముకాటు వేయడంతో జమ్మూలో ప్రాణాలు కోల్పోయాడు.
అతని పుట్టినరోజైన మార్చి 10నే మరణించడంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. శనివారం తెల్లవారుజామున కరుణాకర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. కరీంనగర్ ఓఎస్డీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పోలీసులు, సైనికుల గౌరవవందనంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.