ఎల్‌వోసీ వెంబడి పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
శ్రీనగర్: నియంద్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి పాకిస్తాన రేంజర్లు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భారత జవాన్ ఒకరు మంగళవారం ప్రాణాలు విడిచారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ఎల్‌వోసీ వద్ద గడిచిన రెండు రోజులుగా పాకిస్తాన్ బలగాలు కాల్పులకు పాల్పడుతున్నాయి. కాల్పుల్లో భారత సైనికుడు మృతిచెందడం ఇది రెండోసారి. మృతిచెందిన సైనికుడి వివరాలు తెలియాల్సి ఉంది.