వరుస వీడియోలతో భారత సైనికలు తమ సమస్యలను బయట పెడుతున్నారు. గతంలో సరిహద్దులో పనిచేస్తున్న సైనికుల పరిస్థితి దారుణంగా ఉందని, నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ అనే బీఎస్‌ఎఫ్ జవాను సోషల్ మీడియా ద్వారా వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించగా తాజాగా మరో సైనికుడు అదే బాట పట్టాడు.