Prime Minister Office (PMO)
-
7న ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారానికి ఈ సమావేశం మరింతగా తోడ్పడుతుందన్నారు. 2019 జూలై తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సమావేశం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా జరుగుతుందన్నారు. పంటల వైవిధ్యం, పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, అగ్రి కమ్యూనిటీస్, ఎన్ఈపీ అమలు, పట్టణ పాలన వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు ఉంటాయన్నారు. -
నేడు ‘లైఫ్’ను ప్రారంభించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పర్యావరణహిత జీవన శైలి(లైఫ్) అనే ప్రపంచస్థాయి కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్’ను ప్రకటిస్తారు. దీనిద్వారా పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబించేలా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు, సంఘాలను ఒప్పించడానికి, ప్రభావితం చేయడానికి అవసరమైన ఆలోచనలను, సలహాలను విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు నుంచి ఆయన ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రధానోపన్యాసం చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది. కార్యక్రమంలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్ బిల్ గేట్స్, క్లైమేట్ ఎకనమిస్ట్ లార్డ్ నికొలస్ స్టెర్న్, నడ్జ్ థియరీ కర్త కాస్ సన్స్టీయిన్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ సీఈవో, ప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్‌గుప్తా, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తదితరులు పాల్గొంటారు. 10న ‘ఇన్–స్పేస్’ప్రారంభం ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) ప్రధాన కార్యాలయాలను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. అంతరిక్ష కార్యకలాపాలను, అంతరిక్ష శాఖకు చెందిన వివిధ సంస్థలను ప్రభుత్వేతర ప్రైవేట్ సంస్థలు ఉపయోగించుకునేందుకు, ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు ఇవి నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి. -
ప్రధాని మోదీ ఆస్తి విలువ ఎంతంటే!
న్యూఢిల్లీ: గతేడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తి విలువ స్వల్పంగా పెరిగింది. జూన్ 30, 2020 నాటికి ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 2.85 కోట్లు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా వెల్లడించారు. ప్రధాని కార్యాలయానికి ఇటీవల సమర్పించిన నివేదికలో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. వాటి ప్రకారం.. జూన్ నెల ముగిసేనాటికి ప్రధాని మోదీ వద్ద రూ. 31,450 నగదు ఉండగా, ఎస్బీఐ గాంధీనగర్ ఎన్ఎస్సీ శాఖకు చెందిన ఆయన బ్యాంకు ఖాతాలో 3,38,173 రూపాయలు ఉన్నాయి. ఇక అదే బ్రాంచ్‌లో ఓ ఎఫ్డీఆర్ కూడా ఉంది. మల్టీ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్లో రూ. 1,60,28,939 నిల్వ ఉన్నట్లు మోదీ వెల్లడించారు. (చదవండి: అన్ని విధాలా సాయం అందిస్తాం) అదే విధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్(ఎన్ఎస్సీ) విలువ రూ. 8,43,124గా పేర్కొన్నారు. అంతేగాకుండా జీవిత బీమా పాలసీల విలువ రూ. 1,50,597, టాక్స్ సేవింగ్ ఇన్ఫ్రా బాండ్ల విలువ రూ. 20 వేలు, వీటితో పాటు చరాస్తుల విలువ 1.75 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. కాగా ఆయనకు ఏ బ్యాంకులోనూ రుణాలు లేవు. అదే విధంగా సొంత వాహనం కూడా లేదు. ప్రధాని మోదీ వద్ద, సుమారు 45 గ్రాముల బరువుగల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 1.5 లక్షలు. ఇవేగాకుండా, గాంధీనగర్‌లోని సెక్టార్-1లో తనకు ఓ ప్లాట్ ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 3,531 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ స్థలంపై ముగ్గురికి సమాన హక్కు ఉందని, ఒక్కొక్కరికి 25 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. కాగా సుమారు పద్దెనిమిదేళ్ల క్రితం అంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి ముందే ఆయన ఈ స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పుడు ఆ ప్లాట్ విలువ 1.3 లక్షల రూపాయలు. ఇక ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం, ప్రధాని మోదీ స్థిరాస్తి విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని అంచనా. అమిత్ షా ఆస్తి విలువ రూ. 28.63 కోట్లు మరోవైపు.. ఈ ఏడాది ప్రధాని మోదీ ఆస్తిలో స్వల్ప పెరుగుదల నమోదు కాగా, గుజరాత్‌లోని సంపన్న కుటుంబానికి చెందిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంపదలో తగ్గుదల కనిపించింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 2020 నాటికి అమిత్ షా ఆస్తి విలువ రూ. 28.63 కోట్లు(గతేడాది రూ. 32.3 కోట్లు) -
కరోనా: సుప్రీం తీర్పును ఉదహరించిన పీఎంఓ
సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్‌కు వస్తున్న విరాళాల వివరాలు ఇవ్వాలని దాఖలైన ఆర్టీఐ దరఖాస్తును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గతంలో చేసిన వివాదాస్పద ప్రకటనను ఉదహరిస్తూ.. పీఎం కేర్స్ ఫండ్ వివరాలు నేరుగా బహిరంగపర్చలేమని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని పీఎంఓ తెలిపింది. దాంతోపాటు, కోవిడ్ కట్టడికి జరిగిన అత్యున్నస్థాయి సమావేశ వివరాలు బహిరంగం చేయలేమని స్పష్టం చేసింది. సమాచారం హక్కు చట్టం కింద నొయిడాకు చెందిన పర్యావరణ వేత్త విక్రాంత్ తోగాడ్ ఏప్రిల్ 21న పీఎంఓ నుంచి 12 అంశాలతో నివేదిక కోరతూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతను సమర్పించిన ఆర్టీఐ దరఖాస్తు సరిగా లేదని, ఒకే దరఖాస్తులో ఇన్ని వివరాలు ఇవ్వలేమని దేనికదే విడిగా అప్లై చేయాలని సూచించింది. కాగా, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి విరాళాలను సేకరించే లక్ష్యంతో పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్ ఫండ్ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. దీనికి మోదీ ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ఈ విరాళాలకు పన్ను మినహాయింపును ఇచ్చారు. ఇక విచక్షణారహిత, అసాధ్యమైన డిమాండ్ల మేరకు సమాచారం ఇవ్వాలని చూస్తే.. అది ఆ సంస్థ పనితీరుపైనా, ఫలితంగా సమాచారం సేకరించి, సమకూర్చే ఎగ్జిక్యూటివ్‌పైనా పడుతుందని, అలాంటి సందర్భంలో దరఖాస్తులను స్వీకరించాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం ధర్మాసనం వివాదాస్పద ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి: ఇకపై కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా సంక్షోభం: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సహా, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. పలు కీలక శాఖలకు 23 మంది కార్యదర్శులను కొత్తగా నియమించింది. ప్రధాన మంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న అరవింద్ శర్మను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించింది. అదే విధంగా మరో అడిషనల్ సెక్రటరీ తరుణ్ బజాజ్‌ను ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇక ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుధన్ పదవీ కాలాన్ని మూడు నెలలపాటు పొడిగించింది.(872కు చేరిన కరోనా మృతుల సంఖ్య) ఇక కోవిడ్-19 సంక్షోభం ప్రింట్ మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి రవి ఖారేకు ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ను కుటుంబ సంక్షేమ శాఖ ఓఎస్డీగా నియమించిన ప్రభుత్వం... ఆయన స్థానంలో నాగేంద్ర నాథ్ సిన్హాను అపాయింట్ చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ విభాగం కార్యదర్శిగా రవి కాంత్‌ను... అదే విధంగా రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజీవ్ రంజన్ షిప్పింగ్ కార్యదర్శిగా నియమించింది. ఆయన స్థానంలో ఆర్మానే గిరిధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక సీబీఎస్ఈ చైర్పర్సన్ అనితా కర్వాల్‌ను విద్యా శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
‘పీఎం కేర్స్’కు విరాళాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (పీఎం కేర్స్ ఫండ్)కు ఉదారంగా విరాళాలు ఇవ్వవలసిందిగా ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ఏదైనా అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం, బాధితులకు ఉపశమనం అందించడం లాంటి ప్రాథమిక లక్ష్యంతో కూడిన జాతీయ నిధిని ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (పీఎం కేర్స్) ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ కు ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ ఫండ్ చిన్న చిన్న విరాళాలను కూడా అనుమతిస్తుంది. ఈ ఫండ్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలంతా చిన్న విరాళాన్ని అయినా అందించవచ్చు. పౌరులు లేదా సంస్థలు పీఎం ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా పై వివరాలను ఉపయోగించి పి.ఎం. కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందించవచ్చు. ఈ చెల్లింపు పద్ధతులు సైతం పీఎం ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (భీమ్, ఫోన్‌పే, అమెజాన్ పే, గూగుల్ పే, పేటిఎం, మొబిక్విక్, మొదలైనవి),ఆర్.టి.జి.ఎస్./ఎన్.ఇ.ఎఫ్.టి.(నెఫ్ట్), ఈ నిధికి అందించే విరాళాలకు సెక్షన్ 80(జి) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది. -
మోదీ చేతిలో ఉన్నది యాభైవేలే!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ స్థిరచరాస్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం మార్చి 31నాటికి ఆయన వద్ద ఉన్న నగదు కేవలం రూ.48,944 అని తేలింది. ఈ వివరాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) తాజాగా తన వెబ్సైట్లో పొందుపరిచింది. గత ఏడాది మోదీ వద్ద రూ.1,50,000 నగదు ఉండగా ఈ ఏడాది 67శాతం తగ్గింది. ప్రస్తుతం మోదీ మొత్తం స్థిరచరాస్థుల విలువ రూ.2.28 కోట్లు. ఇందులో చరాస్తుల విలువ రూ.1,28,50,498. స్థిరాస్తి అయిన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న మోదీ సొంతింటి మార్కెట్ విలువ దాదాపు రూ.కోటి. అయితే, 16ఏళ్ల క్రితం ఆ ఇంటిని మోదీ కేవలం రూ.లక్షకు కొనుగోలు చేశారు. గాంధీనగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మోదీకి రూ.11,29,690 డిపాజిట్లు ఉన్నాయి. అదే బ్రాంచీలో మోదీ రూ.1,07,96,288 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. మోదీకి తన పేరు మీద కారుగానీ, మరే వాహనమూ లేదు. మోదీ వద్ద బంగారు నగలు లేవు. ప్రధానికాక ముందునాటి 45 గ్రాముల బరువైన రూ.1,38,060 విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మాత్రం ఉన్నాయి. మోదీ ఏ బ్యాంకులో ఎలాంటి రుణాలు తీసుకోలేదు. -
ఆర్మీలో మరో వీడియో కలకలం
-
ఆర్మీలో మరో వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరుస వీడియోలతో భారత సైనికలు తమ సమస్యలను బయట పెడుతున్నారు. గతంలో సరిహద్దులో పనిచేస్తున్న సైనికుల పరిస్థితి దారుణంగా ఉందని, నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ అనే బీఎస్ఎఫ్ జవాను సోషల్ మీడియా ద్వారా వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించగా తాజాగా మరో సైనికుడు అదే బాట పట్టాడు. సెలవుపై ఇంటికెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు తనపై అధికారికింద సహాయక్ నియమించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని పీఎంవోకు, రక్షణశాఖ దృష్టికి తీసుకెళ్లిందుకు తనపై ఉన్నతాధికారులు కక్ష పూరిత చర్యలకు దిగారని ఆరోపించాడు. సింధవ్ జోగుదాస్ అనే వ్యక్తి భారత ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతడు ఈ మధ్య కాలంలోనే సెలవులపై ఇంటికెళ్లి ఆలస్యంగా వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడికి శిక్షగా సహాయక్‌గా నియమించారు. దీనిపై కలత చెందిన సింధవ్.. ఆర్మీ అంటే కేవలం అధికారులకు సేవచేయించడమే ఆనవాయితీగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన ఆరోపణలను భారత ఆర్మీ అంగీకరించదని తెలుసని, అయితే, ఇదే విషయాన్ని తమ సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన వాట్సప్ నెంబరుకు ఫిర్యాదు చేసినా సమాధానం రాలేదన్నాడు. సహాయక్‌గా పనిచేయడానికి అంగీకరించక పోవడంతో ఏడురోజులుపాటు తనను అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఈ విషయం పీఎంవోకు చెబితే సైనిక కోర్టు తప్పుబట్టిందని, అదే విషయాన్ని మరోసారి పీఎంవోకు, రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. నావిక దళం, వాయుసేనలో కూడా ఇలాంటి సహాయక్ వ్యవస్థ లేదని గుర్తు చేశాడు. గతంలో సహాయక్ వ్యవస్థపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసి విమర్శించిన రేమాథ్యూ మహారాష్ట్ర డిలాలి కంటోన్మెంట్లో మృతిచెందిన విషయం తెలిసిందే.