ఆర్మీ జవాన్‌ తల్లిపై దాడి | Man Attack on Army Jawan Mother in Adilabad | Sakshi
Sakshi News home page

ఆర్మీ జవాన్‌ తల్లిపై దాడి

Published Tue, Jun 23 2020 12:10 PM | Last Updated on Tue, Jun 23 2020 12:10 PM

Man Attack on Army Jawan Mother in Adilabad - Sakshi

దాడిచేస్తున్న ప్రకాశ్‌రావు ,గాయపడిన నాగమ్మ

కౌటాల(సిర్పూర్‌): సీఆర్‌ఎఫ్‌ ఆర్మీ జవాన్‌ తల్లిపై ఒకరు దాడికి పాల్పడిన ఘటన కౌటాల మండలం ముత్తంపేటలో చోటు చేసుకుంది. ముత్తంపేట గ్రామానికి చెందిన గాదిరెడ్డి  శ్రీనివాస్‌ ఆర్మీ జవాన్‌గా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి గాదిరెడ్డి నాగులు గతంలోనే మృతిచెందగా నాగమ్మ కోడలితో కలిసి ముత్తంపేటలో నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం నాగమ్మ తన ఇంటి వద్ద పెరట్లో కూరగాయల విత్తనాలు వేస్తుండగా అదే గ్రామానికి చెందిన కమలకర్‌ ప్రకాశ్‌రావు అనే వ్యక్తి మీరు నివాసం ఉంటున్న భూమి తనదని, విత్తనాలు వేయవద్దని నాగమ్మపై దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళకు గాయాలయ్యాయి. నాగమ్మ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement