'ఇక రెండో ఛాన్స్ లేదు'
ఢాకా: ఒక టెస్టు మ్యాచ్ , మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా తమ ప్రణాళిలను పక్కాగా అమలు చేయాలని ఆస్ట్రేలియా బౌలింగ్ లెజెండ్ మెక్ గ్రాత్ స్పష్టం చేశాడు. ప్రధానంగా ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే బంగ్లాదేశ్ తో ఆడుతున్నందున టీమిండియా ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కోలుకోవడానికి మరో అవకాశం లేదన్నాడు.
'టీమిండియా ప్రణాళికల్లో కచ్చితత్వం ఉండాలి. వారితో ఆడేది ఒక టెస్ట్ మాత్రమే అనే సంగతి గుర్తించుకోవాలి. టెస్ట్ సిరీస్ అయితే తరువాత మ్యాచ్ గురించి ఆలోచిస్తాం. అక్కడ టీమిండియాకు రెండో ఛాన్స్ లేదు' బంగ్లాతో జాగ్రత్తగా ఆడితే టీమిండియాదే విజయం అని మెక్ గ్రాత్ తెలిపాడు. ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకోకుడూదని హెచ్చరించాడు
ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టులో గెలిస్తేనే ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఏకంగా ఏడో ర్యాంక్‌కు పడిపోతుంది. ఒకవేళ డ్రా అయినా నాలుగో ర్యాంక్‌కు కోహ్లిసేన పడిపోయే అవకాశం ఉంది.