నంబర్‌వన్ భారత్
గదను అందుకున్న కోహ్లి
కివీస్‌తో టెస్టు సిరీస్‌తో విజయంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్‌గా నిలవడం భారత్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. రెండో టెస్టు తర్వాతే అగ్రస్థానానికి చేరినా, సిరీస్ తర్వాత దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. కెప్టెన్ కోహ్లి తొలిసారిగా నంబర్‌వన్ గదను అందుకోవడం విశేషం. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ దీనిని అందజేశారు. ఇంగ్లండ్ చేతిలో ఓడితే తప్ప... ఇతర సిరీస్‌ల ఫలితాలు భారత్ టాప్ ర్యాంక్‌ను ప్రభావితం చేయలేవు.
మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్‌సలో అశ్విన్ (900 రేటింగ్ పారుుంట్లు) మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. భారత్ తరఫున తొలిసారి ఒక బౌలర్ 900 పారుుంట్లను అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘ఏదో ఒక రోజు టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడ మే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నంబర్‌వన్ జట్టులో భాగం కావడం చాలా గర్వంగా అనిపిస్తోంది. కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు చివరకు సమష్టితత్వం మమ్మల్ని ఈ స్థారుుకి చేర్చింది. ఎంతో శ్రమ, పట్టుదల కనబర్చిన జట్టు సభ్యులందరి వల్లే ఇది సాధ్యమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ టీమ్‌గా మారేందుకు సహకరించినవారందరికీ కృతజ్ఞతలు. మున్ముందు ఈ విజయాలను కొనసాగిస్తామని విశ్వాసంతో ఉన్నా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.