ICC ranking
-
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విండీస్.. టాప్‌లోనే భారత్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ సత్తా చాటింది. అంతర్జాతీయ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విండీస్ జట్టు రెండు స్ధానాలు ఎగబాకి నాలుగో స్ధానానికి చేరుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కరేబియన్లు.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు వెస్టిండీస్ జట్టు అద్బుతమైన ఫామ్‌లో ఉంది. రెగ్యూలర్ కెప్టెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి ఆటగాళ్లు లేకుండానే ప్రోటీస్ జట్టును వెస్టిండీస్ చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కరేబియన్లు సత్తాచాటారు.తమ సొంత గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని విండీస్ జట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ర్యాకింగ్స్లో అగ్రస్ధానంలో భారత్(264 రేటింగ్) కొనసాగుతోంది. టీమిండియా తర్వాతి స్ధానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నిలిచాయి. -
ఆ మ్యాచ్‌కు ముందు 10.. ఇప్పుడు 3
మాంచెస్టర్ : వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో పది వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకిగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు.బ్రాడ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ మూడో టెస్టును 269 పరుగుల తేడాతో గెలవడంలో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 16 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలిచి విస్డెన్ ట్రోఫీని తిరిగి కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు బ్రాడ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏడుస్థానాలు ఎగబాకి మూడోస్థానంలో నిలిచాడు. అలాగే, బ్రాడ్ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు నమోదు చేసిన ఏడో బౌలర్‌గా అవతరించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 45 బంతుల్లో 62 పరుగులు చేసి, ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్‌లో 11 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ టెస్టు బౌలర్ల టాప్ 10 ర్యాంకింగ్స్ లిస్ట్‌ను ట్విటర్లో విడుదల చేసింది.ఈ జాబితాలో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. కమిన్స్ ఖాతాలో 904 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.తర్వాత వరుసగా నీల్ వాగ్నర్ (843), స్టువర్ట్ బ్రాడ్ (823), టిమ్ సౌథీ (812), జాసన్ హోల్డర్ (810) వరుసగా టాప్-5లో ఉన్నారు. (అప్పుడు ఆరు సిక్సర్లు.. ఇప్పుడు ప్రశంసలు) It just keeps getting better for @StuartBroad8! After becoming the latest entrant in the highly exclusive 500 Test wicket club, he has jumped seven spots to go to No.3 in the @MRFWorldwide ICC Test Rankings for bowlers 👏👏👏 pic.twitter.com/XgX4YRdZLh — ICC (@ICC) July 29, 2020 -
నంబర్‌వన్ భారత్
గదను అందుకున్న కోహ్లి కివీస్‌తో టెస్టు సిరీస్‌తో విజయంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్‌గా నిలవడం భారత్ ఆనందాన్ని రెట్టింపు చేసింది. రెండో టెస్టు తర్వాతే అగ్రస్థానానికి చేరినా, సిరీస్ తర్వాత దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. కెప్టెన్ కోహ్లి తొలిసారిగా నంబర్‌వన్ గదను అందుకోవడం విశేషం. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ దీనిని అందజేశారు. ఇంగ్లండ్ చేతిలో ఓడితే తప్ప... ఇతర సిరీస్‌ల ఫలితాలు భారత్ టాప్ ర్యాంక్‌ను ప్రభావితం చేయలేవు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్‌సలో అశ్విన్ (900 రేటింగ్ పారుుంట్లు) మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. భారత్ తరఫున తొలిసారి ఒక బౌలర్ 900 పారుుంట్లను అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘ఏదో ఒక రోజు టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడ మే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నంబర్‌వన్ జట్టులో భాగం కావడం చాలా గర్వంగా అనిపిస్తోంది. కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు చివరకు సమష్టితత్వం మమ్మల్ని ఈ స్థారుుకి చేర్చింది. ఎంతో శ్రమ, పట్టుదల కనబర్చిన జట్టు సభ్యులందరి వల్లే ఇది సాధ్యమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ టీమ్‌గా మారేందుకు సహకరించినవారందరికీ కృతజ్ఞతలు. మున్ముందు ఈ విజయాలను కొనసాగిస్తామని విశ్వాసంతో ఉన్నా’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. -
టెస్టు ర్యాకింగ్ లో పుజారాకు 5వ స్థానం
దుబాయ్: భారత ఆటగాడు చటేశ్వర్ పుజారా టెస్ట్ ర్యాంకుల్లో ఐదో స్థానానికి దూసుకొచ్చాడు. సౌతాఫ్రికాలో నిలకడగా రాణించిన పుజారా.. రెండు ర్యాంకులు పైకి ఎగబాకి తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం పుజారా 851 పాయింట్లతో టాప్ టెన్‌లో ఉన్న ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. కాగా, విరాట్ కోహ్లి మాత్రం ఒక స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ లిస్ట్‌లో ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియా స్పిన్నర్ అశ్విన్.. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో డివిలియర్స్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. చంద్రపాల్, రాస్ టేలర్ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారు.