ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ సత్తా చాటింది. అంతర్జాతీయ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విండీస్ జట్టు రెండు స్ధానాలు ఎగబాకి నాలుగో స్ధానానికి చేరుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కరేబియన్లు.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు వెస్టిండీస్ జట్టు అద్బుతమైన ఫామ్‌లో ఉంది. రెగ్యూలర్ కెప్టెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి ఆటగాళ్లు లేకుండానే ప్రోటీస్ జట్టును వెస్టిండీస్ చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కరేబియన్లు సత్తాచాటారు.
తమ సొంత గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని విండీస్ జట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ర్యాకింగ్స్‌లో అగ్రస్ధానంలో భారత్(264 రేటింగ్) కొనసాగుతోంది. టీమిండియా తర్వాతి స్ధానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment