
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఫామ్‌లోకి వచ్చాడు. నిన్న (మార్చి 15) జరిగిన కేకేఆర్ ఇన్‌ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 33 బంతులు ఎదుర్కొని 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహించిన టీమ్ పర్పుల్ టీమ్ గోల్డ్‌పై విజయం సాధించింది.
ఐపీఎల్ ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్కాడ్ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కూడా ఇన్‌ట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. టీమ్ పర్పుల్‌కు అజింక్య రహానే.. టీమ్ గోల్డ్‌కు వెంకటేశ్ అయ్యర్ సారథ్యం వహించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ గోల్డ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (61) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. లవ్నిత్ సిసోడియా 46 పరుగులతో రాణించాడు.
అనంతరం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ పర్పుల్.. రింకూ సింగ్ చెలరేగడంతో 15.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో విజయం సాధించాక కూడా మ్యాచ్‌ను కొనసాగించారు. రెండో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ లక్ష్యాన్ని కూడా టీమ్ పర్పుల్ మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మరో లక్ష్యంగా టీమ్ పర్పుల్‌కు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఈసారి టీమ్ పర్పుల్ 280 పరుగుల లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో టీమ్ పర్పుల్ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. టీమ్ పర్పుల్ ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్‌తో పాటు ఆండ్రీ రసెల్ (64 నాటౌట్), క్వింటన్ డికాక్ (52) చెలరేగిపోయారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2025 సీజన్‌లో కేకేఆర్ జర్నీ లీగ్ ఆరంభ రోజున (మార్చి 22) ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హెం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. గత సీజన్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ సన్‌నైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి, తమ మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విడిచిపెట్టాడు.
మెగా వేలంలో శ్రేయస్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది. శ్రేయస్‌ను ఆ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. శ్రేయస్ వీడటంతో కేకేఆర్‌కు కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. మెగా వేలంలో బేస్ ధర రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన అజింక్య రహానేను కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్‌ను నియమించింది. తొలుత వెంకటేశ్ అయ్యర్‌నే కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో రహానే ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీని ఎగరేసుకుపోయాడు. మెగా వేలంలో రహానేను కేకేఆర్ తొలుత పట్టించుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్ల రౌండ్‌లో రహానేను కేకేఆర్ దక్కించుకుంది.
2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..
అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్‌నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్
Comments
Please login to add a commentAdd a comment