Coach post
-
ముగింపు బాగుండాల్సింది: అనిల్ కుంబ్లే
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా తన పదవీ కాలం సంతృప్తికరంగా సాగిందని, అయితే ముగింపు మరికాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే అన్నాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో ఆడిన 17 టెస్టులో 1 మాత్రమే ఓడిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది. కానీ కెప్టెన్ కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే అర్ధాంతరంగా తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆ ఏడాది కాలం మా జట్టు చాలా బాగా ఆడింది. అందులో నా పాత్ర కూడా కొంత ఉండటం సంతోషకరం. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయితే కోచ్‌గా నా చివరి రోజులు మరింత బాగా ఉండాల్సిందనే విషయం నాకు తెలుసు. కానీ నేను బాధపడటం లేదు. తప్పుకునేందుకు సరైన సమయమని కోచ్‌కు అనిపిస్తే తప్పుకోవడమే మంచిది. నాకు భారత కోచ్‌గా అవకాశం రావడం, సంవత్సరంపాటు జట్టు ఆటగాళ్లతో గడపడం అద్భుతం. అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి మరోసారి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం గొప్ప అనుభూతి’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. -
రవిశాస్త్రి అధికారికంగా...
భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మాజీ టీమ్ డైరెక్టర్ న్యూఢిల్లీ: మాజీ టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి భారత హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశారు. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సచిన్, కెప్టెన్ కోహ్లి అండదండలతో రవిశాస్త్రి ఇప్పుడు రేసులో ముందు వరుసలో ఉన్నారు. కోచ్ పదవికి శాస్త్రితో పాటు తాజాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ కూడా దరఖాస్తు చేశారని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. ఇదివరకే టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్, వెంకటేశ్ ప్రసాద్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వీరిని గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడి న సీఏసీ ఇంటర్వ్యూ చేయనుంది. ఇటీవల గంగూలీ మాట్లాడుతూ ఈ నెల 10న ఇంట ర్వ్యూలకు ఆహ్వానిస్తామని చెప్పారు. కెప్టెన్ కోహ్లితో విబేధాలు రావడంతో కోచ్ కుంబ్లే విండీస్ పర్యటనకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేశారు. -
సచిన్ చెప్పాడని...
కోచ్‌గా కుంబ్లే నిష్క్రమణతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది. ముందుగా టామ్ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు రేసులో ఉన్నా ఇప్పుడు రవిశాస్త్రి తెరమీదికొచ్చారు. ఉన్నపళంగా ఆయన దరఖాస్తు చేయడం ఆశ్చర్యపరిచినా... సచిన్ సూచనతోనే లండన్‌లో ఉన్న ఆయన కోచ్ పదవిపై ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. కెప్టెన్ కోహ్లి కూడా శాస్త్రిపైనే మొగ్గుచూపుతుండటంతో కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. కోచ్ రేసులోకి వచ్చిన రవిశాస్త్రి ముంబై: అనిల్ కుంబ్లే కంటే ముందు టీమిండియాను రవిశాస్త్రి డైరెక్టర్ హోదాతో నడిపించాడు. ఆయన మార్గదర్శనంలోనే భారత జట్టు టి20, వన్డే ప్రపంచకప్‌లలో సెమీఫైనల్స్ చేరింది. ఏడాది తర్వాత తాజాగా కుంబ్లే–కోహ్లి వివాదంతో ఖాళీ అయిన కోచ్ పదవిపై మొదట్లో ఆసక్తి కనబరచని రవిశాస్త్రి అనూహ్యంగా తానూ దరఖాస్తు చేస్తున్నానని చెప్పారు. ఇప్పటిదాకా టామ్ మూడీ, సెహ్వాగ్, రాజ్‌పుత్‌లు రేసులో ఉండగా... తాజాగా ఈ జాబితాలో శాస్త్రి చేరారు. ఇది ఎవరూ ఊహించని పరిణామమైనప్పటికీ... ఒకే ఒక్కరి సూచనతో ఈ రేస్ ముఖచిత్రం మారింది. ఆయనే సచిన్ టెండూల్కర్. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సచిన్ చెప్పాడనే రవిశాస్త్రి తెరమీదికొచ్చారు. మొదట కోచ్ కోసం క్యూ లైన్లో నిలబడనన్న వ్యక్తి (శాస్త్రి) రేసులోకి రావడానికి కారణం సచినే అని తెలిసింది. కెప్టెన్ కోహ్లి కూడా మాజీ టీమ్ డైరెక్టర్ వైపే మొగ్గుచూపుతుండటంతో రేపోమాపో రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అపుడూ... ఇపుడూ ‘మాస్టరే’ మద్దతు నిజానికి... ఏడాది క్రితమే కుంబ్లేతో రవిశాస్త్రి పోటీపడ్డారు. అప్పుడూ సచిన్ సీఏసీ ఇంటర్వ్యూలో ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. కానీ గంగూలీ... కుంబ్లేవైపు మొగ్గుచూపడం, మరో సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా కుంబ్లేకే ఓటేయడంతో రవిశాస్త్రి కథ కంచికి చేరింది. దీనిపై ఈ మాజీ డైరెక్టర్ బాహటంగానే గంగూలీని విమర్శించారు. ఇపుడు కూడా కోచ్ పదవికి అర్హుడిని తేల్చేది సీఏసీనే కాబట్టి గంగూలీ వ్యతిరేకత దృష్ట్యా తనకు ఆ అవకాశం రాదని రవిశాస్త్రి అటువైపు కన్నెత్తి చూడలేదు. ఎంచక్కా కుటుంబంతో లండన్‌లో సేదతీరుతున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు అక్కడి నుంచే కోచ్ పదవిపై తన ఆసక్తిని తెలిపారు. ఈ ఆశ్చర్యపరిణామానికి లండన్‌లోనే ఉన్న సచినే కారణమని సమాచారం. అనిల్‌ను అవమానించారు: సన్నీ కోచ్, కెప్టెన్ల వివాదంపై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ తొలిసారి ఘాటుగా స్పందించారు. అందరూ కలిసి ఓ దిగ్గజ బౌలర్‌ను అవమానించారని అన్నారు. ‘కుంబ్లేకు ఎదురైన అనుభవం చూస్తుంటే బాధేస్తోంది. భారత క్రికెట్ లెజెండ్‌ను ఇంతలా అగౌరవపరచడం శోచనీయం. కుంబ్లే లాంటి మేటి ఆటగాడికే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఇకపై ఏ టాప్‌స్టార్ భారత కోచ్ పదవిపై ఆసక్తి కనబరచడు. దీంతో ఫలితాలు సాధించే కోచ్‌ను భారత క్రికెటర్లు సహించలేరనే విషయం ఈపాటికే అందరికీ అర్థమైంది’ అని సన్నీ పేర్కొన్నారు. -
క్రికెట్ కోచ్ పదవికి 50పైగా దరఖాస్తులు!
న్యూఢిల్లీ:భారత ప్రధాన కోచ్ పదవికి 50పైగా దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ తాజాగా స్సష్టం చేసింది. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్‌తో మరో 55 దరఖాస్తులు వచ్చినట్లు ఆదివారం ఓ ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. టీమిండియా కోచ్ పదవి అన్వేషణలో భాగంగా దరఖాస్తులకు జూన్ 10వ తేదీని డెడ్ లైన్‌గా విధించిన సంగతి తెలిసిందే. 'విదేశీ దరఖాస్తులతో కలుపుకుని ప్రధాన కోచ్ పదవికి 57 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దరఖాస్తులు ప్రాథమిక పరిశీలనలో ఉన్నాయి.ఆ తర్వాత అర్హులైన కొంతమందిని పరిశీలించి సమావేశం ఏర్పాటు చేస్తాం. దాని ప్రకారం రూపొందించిన జాబితా మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది' అని బీసీసీఐ తెలిపింది. -
బీసీసీఐకి రవిశాస్త్రి షరతు!
ముంబై: ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఒక షరతును కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ముందు ఉంచాడట. ఒకవేళ తనను కోచ్ ఎంపిక చేస్తే మాత్రం మిగతా సహాయక సిబ్బందిని తానే ఎంపిక చేసుకుంటానంటూ బోర్డుకు స్సష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆరుగురు సిబ్బంది అవసరం కూడా బీసీసీఐకి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అందులో భరత్ అరుణ్(బౌలింగ్ కోచ్), సంజయ్ బంగర్(బ్యాటింగ్ కోచ్), ఆర్ శ్రీధర్(ఫీల్డింగ్ కోచ్), పాట్రిక్ ఫర్హాట్(ఫిజియో),శంకర్ బాసు(ట్రైనర్), రఘు(టీమ్ అసిస్టెంట్)లన తన సహాయక సిబ్బందిగా శాస్త్రి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. గత రెండు రోజుల క్రితం భారత క్రికెట్ కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీమిండియాకు రవిశాస్త్రి 18 నెలల పాటు డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తరువాత డైరెక్టర్ స్థానంలో తిరిగి కోచ్‌నే నియమించాలని బీసీసీఐ భావిస్తుండటంతో పలువురు క్రికెట్ పెద్దలు దీనికి పోటీ పడుతున్నారు. అటు రవిశాస్త్రితో పాటు, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్, మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్‌లు ప్రధాన కోచ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. -
కోచ్ పదవికి దరఖాస్తు చేశా: రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి తాను దరఖాస్తు చేసినట్లు రవిశాస్త్రి తెలిపారు. 18 నెలల పాటు జట్టుకు డెరైక్టర్‌గా పని చేసిన ఆయన బోర్డు ప్రకటనలో కోరిన అన్ని డాక్యుమెంట్స్‌ను అందజేసినట్లు తెలిపారు. ‘కోచ్ పదవికి దరఖాస్తు చేయడం వరకే నా పని. ఆ తర్వాత నిర్ణయం నా చేతుల్లో లేదు. దీనిపై ఇంతకుమించి నేను వ్యాఖ్యానించను’ అని రవిశాస్త్రి అన్నారు.