క్రికెట్ కోచ్ పదవికి 50పైగా దరఖాస్తులు! | Shastri, Patil among 57 applicants for India coach's post | Sakshi
Sakshi News home page

క్రికెట్ కోచ్ పదవికి 50పైగా దరఖాస్తులు!

Published Sun, Jun 12 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Shastri, Patil among 57 applicants for India coach's post

న్యూఢిల్లీ:భారత ప్రధాన కోచ్ పదవికి 50పైగా దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ తాజాగా స్సష్టం చేసింది. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్తో మరో 55 దరఖాస్తులు వచ్చినట్లు ఆదివారం ఓ ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. టీమిండియా కోచ్ పదవి అన్వేషణలో భాగంగా దరఖాస్తులకు  జూన్ 10వ తేదీని డెడ్ లైన్గా విధించిన సంగతి తెలిసిందే.

'విదేశీ దరఖాస్తులతో కలుపుకుని ప్రధాన కోచ్ పదవికి 57 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దరఖాస్తులు ప్రాథమిక పరిశీలనలో ఉన్నాయి.ఆ తర్వాత అర్హులైన కొంతమందిని పరిశీలించి సమావేశం ఏర్పాటు చేస్తాం.  దాని ప్రకారం రూపొందించిన జాబితా మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది' అని బీసీసీఐ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement