
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా తన పదవీ కాలం సంతృప్తికరంగా సాగిందని, అయితే ముగింపు మరికాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే అన్నాడు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో ఆడిన 17 టెస్టులో 1 మాత్రమే ఓడిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది. కానీ కెప్టెన్ కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే అర్ధాంతరంగా తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆ ఏడాది కాలం మా జట్టు చాలా బాగా ఆడింది. అందులో నా పాత్ర కూడా కొంత ఉండటం సంతోషకరం. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయితే కోచ్‌గా నా చివరి రోజులు మరింత బాగా ఉండాల్సిందనే విషయం నాకు తెలుసు. కానీ నేను బాధపడటం లేదు. తప్పుకునేందుకు సరైన సమయమని కోచ్‌కు అనిపిస్తే తప్పుకోవడమే మంచిది. నాకు భారత కోచ్‌గా అవకాశం రావడం, సంవత్సరంపాటు జట్టు ఆటగాళ్లతో గడపడం అద్భుతం. అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి మరోసారి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం గొప్ప అనుభూతి’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment