Woolworths
-
మావాళ్లకు కాస్త ఉద్యోగాలు ఇవ్వండి
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి బయట మరోచోట ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో సహకరించేందుకు సిద్ధమైంది. జూన్ 30 వరకు తమవారికి తాత్కాలిక ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అతి పెద్ద సూపర్ మార్కెట్ గ్రూప్‌లలో ఒకటి, తమ క్రికెట్ టీమ్ స్పాన్సర్ అయిన ‘వూల్వర్త్’ను కోరింది. ‘బోర్డులో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా బయట ఏదో ఒక ఏర్పాట్లు చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే వూల్వర్త్ సీఈఓ బ్రాడ్ బాండుసీకి నేను స్వయంగా లేఖ రాశాను. వారి సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం సిబ్బంది అవసరం ఉందన్నట్లు మాకు తెలిసింది. అందుకే మా వాళ్లను తీసుకోమన్నాం’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్సన్ వెల్లడించారు. -
చచ్చి బతికినంతపనైంది!
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలో వూల్ వర్త్ అనే అతి పెద్ద సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న ఆలుగడ్డలు తిని సచ్చిబతికనంతపనైంది ఓ భారతీయ మహిళకు. చివరకు కోలుకున్న ఆమె తనకు విషపూరిత ఆలుగడ్డలు అమ్మిన ఆ సూపర్ మార్కెట్‌కు కోర్టు ద్వారా నోటీసులు పంపించింది. న్యూక్యాజిల్ లో నివాసం ఉంటున్న రజ్ వీర్ కౌర్ గత ఏడాది ఏప్రిల్ నెలలో కొన్ని సిడ్నీలోని వూల్ వర్త్ మార్కెట్ లో ఆలుగడ్డలతోపాటు ఆహార పదార్థాలను కొనుగోలు చేసింది. వాటితో కూర చేసుకొని భోజనం చేశాక అది కాస్త ఫుడ్ పాయిజన్‌గా మారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అనంతరం వారం రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. కాలేయాన్ని కూడా మార్చాల్సిన అవసరం వచ్చింది. దీంతోపాటు ఆమె శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎట్టకేలకు ఆమె నాలుగు నెలల తర్వాత కోలుకుని ప్రాణాలతో బయటపడింది. ఆ వెంటనే సదరు మార్కెట్‌కు నోటీసులు పంపించింది.