షాపింగ్ వెళితే దెయ్యం పట్టిందా? | Possessed' woman collapses and lets out blood-curdling screams in the supermarket | Sakshi
Sakshi News home page

షాపింగ్ వెళితే దెయ్యం పట్టిందా?

Published Fri, Jun 3 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

షాపింగ్ వెళితే దెయ్యం పట్టిందా?

షాపింగ్ వెళితే దెయ్యం పట్టిందా?

బీజింగ్: మనిషి సహజంగా ఉన్నప్పుడు పక్కన ఉండొచ్చేమోగానీ దెయ్యంపట్టినట్లుగా ఉంటే మాత్రం వారి దగ్గరకు వెళ్లాలంటే మాత్రం గుండెను తడుముకోవాల్సిందే. ఇలా చైనా షాపింగ్ మాల్స్ ఒక్కరు కాదు మొత్తం నలుగురు వ్యక్తులు తమ గుండెలను తడుముకోవాల్సి వచ్చింది. షాపింగ్ కు వచ్చిన ఓ మహిళ అనూహ్యంగా ఎవరి చేతుల్లోనో బంధీ అయినట్లుగా కంపించడంతో వారంతా ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందంటే చైనాలోని  ఓషాపింగ్ మాల్లో షాపింగ్ చేసేందుకు ఒక మహిళ వచ్చింది. ఆమెకు ఎదురుగా మరో మహిళ ఉంది. తనకు కావాల్సిన వస్తువులు చూసుకుంటుండగా ఒక పుస్తకంలాంటిది కిందపడింది.

దాంట్లోకి తదేకంగా చూసిన ఆమె అనంతరం దానిని ఉన్నచోటులో పెట్టి అలా వెనక్కి తిరిగింది. దాంతో ఒక్కసారిగా ఆమె ఎవరికో అవాహనం అయినట్లుగా కంపిచడం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్న మహిళ భయంభయంగా దగ్గరికి అడుగులు వేస్తూ వచ్చింది. ఆమె వెనుకాలే ఉన్న మరో వ్యక్తి మాత్రం అలాగే చూస్తున్నాడు. ఆమెను సమీపించిన మహిళ ఏం జరిగిందని ప్రశ్నించే క్రమంలో ఆమెను టచ్ చేయగానే ఏదో కరెంట్ షాక్ తగిలినట్లుగా కొంచెం దూరం ఎగిరిపడింది. ఆ వెంటనే వచ్చిన మరో ఇద్దరు భయంభయంగానే ఆమెను సమీపించినా అందులోని ఓ వ్యక్తి ధైర్యం చేసి ఆమె చేయిపట్టుకున్నాడు.

మూర్చ అనుకొని చెవులు మూయడం లాంటివి చేస్తున్నాడు. ఆ మరో వ్యక్తి కాళ్లను రుద్దే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఆమె శరీరం మరోసారి విపరీతంగా కంపిచడంతో అక్కడున్న ముగ్గురు మరోసారి ఎగిరి అక్కడ ఉన్న వస్తువుల స్టాండ్స్ కు బలంగా తగలడంతో అందులోని వస్తువులు కిందపడ్డాయి. చివరకు ఆమె శాంతించడంతో ఆ ముగ్గురుకలిసి బయటకు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కొందరు దయ్యం పట్టిందని, ఇంకొందరు మూర్చ అని, మరికొందరు ఆమె చేసిందంటూ తమకు నచ్చిన అభిప్రాయాలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement