possessed
-
అన్యాక్రాంతమైన భూమి స్వాధీనం
పెనుగుదురు (కరప): దశాబ్ద కాలంగా అన్యాక్రాంతమైన పంటభూమిని ఎట్టకేలకు ట్రిబ్యునల్ తీర్పుతో దేవాదాయశాఖ సోమవారం స్వాధీనం చేసుకుంది. పెనుగుదురులోని వేణుగోపాలస్వామి దేవస్ధానానికి సంబంధించిన 1.45 ఎకరాల పంటభూమిని ఒకవ్యక్తి అనధికారికంగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినా, కుదరక పోవడంతో దేవాదాయశాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పు దేవాదాయశాఖకు అనుకూలంగా వచ్చింది. దీంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్‌బాబు పలువురు ఈఓలు, సిబ్బందితోపాటు వీఆర్వోలు, పోలీసు బందోబస్తుతో వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ పెన్సింగ్ ఏర్పాటుచేసి, ఎర్రజెండాలుపాతి, దేవాదాయశాఖకు చెందిన భూమిగా బోర్డును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా డీసీ రమేష్‌బాబు మాట్లాడుతూ 20 రోజుల వ్యవధిలోనే మూడేళ్ల కాలపరిమితికి కౌలుహక్కుకోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తిఉన్న రైతులు రూ.10వేలు డిపాజిట్ చెల్లించి, వేలంపాటలో పాల్గొనవచ్చన్నారు. వెంటనే బహిరంగ వేలంపాటకు ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఇన్స్పెక్టర్ డేగల సతీష్‌కుమార్‌ను డీసీ ఆదేశించారు. కరప ఎస్ఐ మెల్లం జానకీరాం ఆధ్వర్యంలో ఏఎస్ఐ కేఏవీఎస్ఎస్ ఆచార్యులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
షాపింగ్ వెళితే దెయ్యం పట్టిందా?
బీజింగ్: మనిషి సహజంగా ఉన్నప్పుడు పక్కన ఉండొచ్చేమోగానీ దెయ్యంపట్టినట్లుగా ఉంటే మాత్రం వారి దగ్గరకు వెళ్లాలంటే మాత్రం గుండెను తడుముకోవాల్సిందే. ఇలా చైనా షాపింగ్ మాల్స్ ఒక్కరు కాదు మొత్తం నలుగురు వ్యక్తులు తమ గుండెలను తడుముకోవాల్సి వచ్చింది. షాపింగ్ కు వచ్చిన ఓ మహిళ అనూహ్యంగా ఎవరి చేతుల్లోనో బంధీ అయినట్లుగా కంపించడంతో వారంతా ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందంటే చైనాలోని ఓషాపింగ్ మాల్లో షాపింగ్ చేసేందుకు ఒక మహిళ వచ్చింది. ఆమెకు ఎదురుగా మరో మహిళ ఉంది. తనకు కావాల్సిన వస్తువులు చూసుకుంటుండగా ఒక పుస్తకంలాంటిది కిందపడింది. దాంట్లోకి తదేకంగా చూసిన ఆమె అనంతరం దానిని ఉన్నచోటులో పెట్టి అలా వెనక్కి తిరిగింది. దాంతో ఒక్కసారిగా ఆమె ఎవరికో అవాహనం అయినట్లుగా కంపిచడం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్న మహిళ భయంభయంగా దగ్గరికి అడుగులు వేస్తూ వచ్చింది. ఆమె వెనుకాలే ఉన్న మరో వ్యక్తి మాత్రం అలాగే చూస్తున్నాడు. ఆమెను సమీపించిన మహిళ ఏం జరిగిందని ప్రశ్నించే క్రమంలో ఆమెను టచ్ చేయగానే ఏదో కరెంట్ షాక్ తగిలినట్లుగా కొంచెం దూరం ఎగిరిపడింది. ఆ వెంటనే వచ్చిన మరో ఇద్దరు భయంభయంగానే ఆమెను సమీపించినా అందులోని ఓ వ్యక్తి ధైర్యం చేసి ఆమె చేయిపట్టుకున్నాడు. మూర్చ అనుకొని చెవులు మూయడం లాంటివి చేస్తున్నాడు. ఆ మరో వ్యక్తి కాళ్లను రుద్దే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఆమె శరీరం మరోసారి విపరీతంగా కంపిచడంతో అక్కడున్న ముగ్గురు మరోసారి ఎగిరి అక్కడ ఉన్న వస్తువుల స్టాండ్స్ కు బలంగా తగలడంతో అందులోని వస్తువులు కిందపడ్డాయి. చివరకు ఆమె శాంతించడంతో ఆ ముగ్గురుకలిసి బయటకు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కొందరు దయ్యం పట్టిందని, ఇంకొందరు మూర్చ అని, మరికొందరు ఆమె చేసిందంటూ తమకు నచ్చిన అభిప్రాయాలు చెప్పారు.