ఫ్రిడ్జ్‌లో 12 అడుగుల కొండచిలువ
కేప్‌టౌన్: నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఓ మహిళ తన నివాసానికి దగ్గరలోని సూపర్ మార్కెట్లోకి వెళ్లింది. పెరుగు ప్యాకెట్ తీసుకుందామని ఫ్రిడ్జ్‌లో చేయిపెట్టిన ఆమె చేతికి 12 అడుగుల కొండచిలువ తగిలింది. అది గమనించిన ఆమె ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది.
అప్రమత్తమైన మార్కెట్ సిబ్బంది ఫ్రిడ్జ్ వద్దకు చేరుకుని అందులో ఉన్న కొండచిలువను చూసి హతశులయ్యారు. వెంటనే పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. మహిళ కొండచిలువను పట్టుకున్న సమయంలో అది గాఢనిద్రలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
వెంటనే మార్కెట్‌కు చేరుకున్న పాములు పట్టే బృందం కొండచిలువను ఫ్రిడ్జ్ లోపలి నుంచి బయటకు లాగింది. ఆ తర్వాత దాన్ని జాతీయ పార్కులో వదిలేశారు. తమ సూపర్‌మార్కెట్ వెనుక చాలా పొదలు ఉన్నాయని, పై కప్పు నుంచో లేదా మార్కెట్ కింది భాగంలో ఉన్న మురుగు కాలువ నుంచో కొండ చిలువ వచ్చి ఫ్రిడ్జ్‌లో చేరుంటుందని యాజమాన్యం పేర్కొంది.