భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్‌ అయినా..! | Two Navy Women Officers Cross Cape Horn | Sakshi
Sakshi News home page

భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్‌ అయినా..!

Published Sun, Feb 16 2025 12:03 PM | Last Updated on Sun, Feb 16 2025 12:13 PM

Two Navy Women Officers Cross Cape Horn

సాహాసయాత్రలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలుస్తున్న మహిళా నేవి అధికారులు మరో అరుదైన సాహసాన్ని నమోదు చేశారు. సాహసమే ఊపిరిగా సాగిపోతున్న లెఫ్టినెంట్ కమాండర్(Lieutenant Commander) దిల్నా కే లెఫ్టినెంట్ కమాండర్ రూప ఏ చారిత్రాత్మక విజయ పరంపరను కొనగిస్తున్నారు. 

ఈ మేరకు ఇద్దరు నేవి అధికారులు నావికా సాగర్ పరిక్రమ II యాత్ర మూడవ దశలో భాగంగా శనివారం ఐఎన్‌ ఎస్‌ తరణిలో(INSV Tarini) దక్షిణ అమెరికా దక్షిణ కొన వద్ద ఉన్న కేప్ హార్న్‌(Cape Horn)ను దాటారని భారత నౌకాదళ ప్రకటించింది. ఆ ప్రాంతం చేరుకోవడానికి ఇద్దరు మహిళా నావిక అధికారులు డ్రేక్‌ సముద్ర మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. 

నిజానికి దక్షిణ అమెరికాకు దక్షిణంగా బహిరంగ సముద్ర మార్గం ఉనికిని నిర్థారించిన ఇంగ్లిష్‌ అన్వేషకుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు మీదగా ఆ మార్గానికి పేరు పెట్టారు. ఈ ప్రాంతం తీవ్రమైన గాలులు, ఎత్తైన అలలతో కూడిన అనూహ్య వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. పైగా ప్రమాదకరమైన జలమార్గం కూడా. 

ఇలాంటి ప్రదేశాన్ని అలవొకగా దాటి మరో విజయ ఢంకా మోగించారు. ఈ కేఫ్‌ హార్న్‌ అంటార్కిటికా నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచు ఖండానికి దగ్గరగా ఉన్న​ భూభాగాల్లో ఒకటి ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే అసాధారణమైన నావిగేషన్‌ నైపుణ్యం తోపాటు దక్షిణ మహాసముద్రంలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. 

కాగా, ఈ నావికా సాగర్ పరిక్రమ II అనేది శాస్త్రీయ అన్వేషణ, సహకారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపును ఇది. అలాగే మహిళా నేవి అధికారులు తమ ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా తదుపరి గమ్యస్థానం వైపు పురోగమిస్తారు. 

అంతేగాక ఈ మిషన్‌ లక్ష్యాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్తారు. ఈ అధికారులు సాహసయాత్ర విజయవంతంగా పూర్తి అయ్యినట్లయితే ప్రపంచంలో తొలిసారిగా ఇద్దరు మహిళా నావికా అధికారులు ప్రపంచ ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసిన వ్యక్తులుగా నిలుస్తారు.  

 

(చదవండి: ఇంజెంక్షన్‌ ఫోబియా: నాకిప్పుడు ఐదో నెల మరి ఎలా..?)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement