మోనికా ఓ మై డార్లింగ్‌..! | Indian Navy Group Dance On Monica O My Darling Song Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

మోనికా ఓ మై డార్లింగ్‌..!

Published Tue, Jan 21 2025 4:31 PM | Last Updated on Tue, Jan 21 2025 4:46 PM

Indian Navy Group Dance On Monica O My Darling Song Goes Viral On Social Media

ఢిల్లీ : మోనికా ఓ మై డార్లింగ్‌..! అంటూ ఇండియన్‌ నేవీ బృందం చేస్తున్న డ్యాన్స్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

జనవరి 26న గణతంత్ర దినోవ్సత వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో విన్యాసాలు చేసేందుకు భారత నావికాదళం బృందం సభ్యులు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే ఎర్రకోట ముందు రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్ విరామ సమయంలో ఉత్సాహం, వినోదాన్ని జోడిస్తూ నేవీ బృందం మోనికా ఓ మై డార్లింగ్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బ్యాండ్‌ వాయించే నేవీ గ్రూప్‌ సభ్యులు మోనికా ఓ మై డార్లింగ్‌ సాంగ్‌ రిథమ్‌కు తగ్గట్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం సంబంధిత వీడియోలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. 


2022లో బాలీవుడ్‌లో వాసన్ బాల డైరెక్షన్‌లో రాజ్‌కుమార్‌రావు, హ్యుమాఖురేషి, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో మోనికా ఓ మై డార్లింగ్‌ సినిమా క్రైమ్‌ కామెడీ కథగా తెరకెక్కింది. ఈ సినిమాలో అంచిత్‌ థక్కర్‌ నేపథ్య సంగీతం డిఫరెంట్‌గా ఉంది. ఓల్డ్‌ మెలోడీ థీమ్‌లో సాగే మ్యూజిక్‌ ఆయా సన్నివేశాలకు కొత్తదనం తెచ్చింది. నేవీ బృందం డ్యాన్స్‌ వేసింది కూడా ఈ సినిమాలోని పాటకే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement