Monica
-
నా మొగుడు ఏం చేసినా పర్లేదు.. అమ్మాయిలతో తిరిగినా నాకు కావాల్సింది అదే!
వాషింగ్టన్: భార్యాభర్తల బంధం అన్నింటికంటే దృఢమైంది అంటారు. పెళ్లయ్యాక పతియే తన సర్వస్వంగా భావిస్తుంటారు మహిళలు. ఒకరిపైఒకరు ప్రేమానురాగాలు చూపుతూ ఆనందంగా జీవిస్తారు. వైవాహిక బంధంలో నిజాయితీ, విధేయతతో ఉండాలనుకుంటారు. అలాంటిది తన భర్త మరో మహిళలో సన్నిహితంగా మెలిగితే? మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే? ఏ భార్య అయినా భరిస్తుందా? ఆమె కోపం ఎలా ఉంటుందో కూడా ఉహించుకోలేం.. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తన భర్తను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉండమని ఆమే ప్రోత్సహిస్తోంది. వాళ్లతో శారీరకంగా కలిసినా పర్వాలేదు అంటోంది. ఆయన ఎవరితో వెళ్లినా, ఏం చేసినా సరే.. సంతోషంగా ఉంటే చాలట. ఆయన హ్యాపీగా ఉంటే తనకు అదే చాలు అని ఆనందంగా చెబుతోంది. ఇది భార్యగా తన బాధ్యత అంటోంది. ఈ మాటలు విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఈరోజుల్లో ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? అని అనుకుంటారు కదా.. భర్తకు ఇంత ఫ్రీడం ఇచ్చి ఈమె పేరు మోనికా హల్ట్. వయసు 37 ఏళ్లు. భర్త పేరు జాన్. పెళ్లయ్యాక ఇంటికే పరిమితమైంది. రోజంతా ఇంటిపనులే చేస్తూ తీరకలేకుండా ఉంటోంది. జాన్‌కు ఇష్టమైన వంటలు చేసిపెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇతర పనులు చేసుకోవడమే ఈమె దినచర్య. అందుకే జాన్‌తో బయటకు వెళ్లే సమయం కూడా ఉండదు. ఈ కారణంగానే భర్తను ఇష్టమైన వారితో గడపమని ఆమే స్వయంగా చెబుతోంది. జాన్‌కు ఏదీ సంతోషం అయితే అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ప్రోత్సహిస్తోంది. అతను ఇతర మహిళలతో శృంగారంలో పాల్గొన్నా తాను అసలు బాధపడనని అంటోంది. అలాగే తాను రోజు ఏ దుస్తులు ధరించాలో కూడా భర్తే డిసైడ్ చేస్తాడని, ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తాని మోనికా పేర్కొంది. సెక్సీ, స్పోర్టీ డ్రస్సులంటే తన భర్తకు ఇష్టమని తాను ఇంట్లో అవే ధరిస్తానని వివరించింది. తాను మేకప్ వేసుకుంటే జాన్‌కు అస్సలు నచ్చదని, అందుకే నేచురల్‌గానే ఉంటానంటోంది. భర్తలు వేరే వాళ్లతో మాట్లాడితేనే ఊరుకోని మహిళలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి భార్య దొరకడం నిజంగా జాన్ అదృష్టం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక..
సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంటే.. అందులోని 185 ప్రాణాలు భయం గుప్పిట్లో బితుకుబితుకుమంటుంటే.. కెప్టెన్ మోనికా ఖన్నా సమర్థత... సత్వర నిర్ణయం ప్రయాణికులతో సహా తననూ సురక్షితంగా భూమికి చేర్చింది. ఆ ధైర్యానికి, సమయస్ఫూర్తికి దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..? ఇటీవల పాట్నా నుంచి ఢిల్లీకి స్పైజ్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ ఎస్జి723 విమానం బయల్దేరింది. పైలట్–ఇన్–కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానాన్ని పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్–ఎయిర్ ఇంజిన్‌లో మంటలు రేగాయి. ఇలాంటి హఠాత్పరిణామాలు సంభవించినప్పుడు సాహసాన్ని, సమర్థతను చూపడంలో ఆడా–మగ తేడా అనేది ఏమీ లేదు. అందరినీ కాపాడటం ఒక్కటే వారి కర్తవ్యం. ఆ దక్షతను చూపడంలో మోనికా ఏ మాత్రం జంకలేదు. తక్షణ నిర్ణయం.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, పాట్నా విమానాశ్రయంలోనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది. ఫస్ట్ ఆఫీసర్ బలప్రీత్ సింగ్‌భాటియా కూడా ఆమె తక్షణ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రయాణికులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని నిపుణులు పరీక్షించి పక్షి ఢీకొట్టడంతో ఫ్యాన్ బ్లేడ్, ఇంజన్ దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రయాణాలను అమితంగా ఇష్టపడే మోనికా ఖన్నా తాజా ఫ్యాషన్, ట్రెండ్స్‌పై అత్యంత ఆసక్తి చూపుతుందని ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సూచిస్తుంది. అంటే, అందం, నలుగురిలో ఆనందంగా ఉండటం అనే అంశాల పట్ల వీరోచితులు దృష్టి పెట్టరు అనేవారికి మోనికా ఓ పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మహిళా శక్తి అనడం కన్నా వీరోచితమైన ప్రజల జాబితాలో మోనికాఖన్నా చేరుతారని ప్రముఖులు ఆమెను కొనియాడుతున్నారు. ‘ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నప్పుడు అందులోని ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని భయంతో బతికిన క్షణాల నుంచి ఆమె విముక్తి కలిగించారు. మోనికా ఖన్నా ధైర్యానికి వందనాలు’ అంటూ దేశవ్యాప్తంగా సిటిజనుల నుంచి నెటిజనుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
కథలకు ఓ బ్యాంకు.. ‘కథా పచ్చీస్– స్టోరీ బ్యాంక్’
మనుషుల్ని ఆకట్టుకోవాలంటే వారికో కథ చెప్పు అంటుంది మోనికా టాండన్. ఢిల్లీలో ఆమె ఒక బ్యాంకు తెరిచింది. దాని పేరు ‘కథా పచ్చీస్– స్టోరీ బ్యాంక్’. ఆ బ్యాంకులో కథలు ఉంటాయి. తల్లిదండ్రులు, టీచర్లు, ఎంట్రప్రెన్యూర్లు, నాయకులు... అందరూ సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకోవాలంటే వారికి కథలు చెప్పడం రావాలి అంటుంది మోనికా. కథలు చెప్తూ పోతే విజయం దానంతట అదే వస్తుందని ఆమె సూత్రం. తనను తాను ‘కార్పొరేట్ స్టోరీ టెల్లర్’ అని చెప్పుకుంటుంది. ఊళ్లో అవ్వలు కథలు చెప్తారు. ఎవరూ డబ్బు ఇవ్వరు. మోనికా అలా కాదు. కథలతో కరెన్సీ సంపాదించవచ్చని నిరూపిస్తోంది. ఒక సంస్థలోని ఉద్యోగులతో మోనికా టాండన్ ‘స్టోరీ టెల్లింగ్’ సెషన్ పెట్టి ఈ కథ చెబుతుంది. ‘ఇది ఒక పీత కథ. దానిని హెర్మిట్ పీత అంటారు. హెర్మిట్ జాతి పీతలు తమ సైజు పెరిగే కొద్దీ ఒక పని చేస్తాయి. ఏమిటో తెలుసా? తమను కప్పి ఉన్న పెంకును వదిలి కొత్త పెంకును వెతుక్కుంటాయి. అవి పాత పెంకును నాశనం చేయవు. అలాగే పాత పెంకే నాకు కావాలి అనుకోవు. దానిని మరొక పీత కోసం వదిలిపెట్టి తమ సైజుకు తగ్గ కొత్త పెంకులోకి మారి తమని తాము కాపాడుకుంటాయి. మళ్లీ సైజు పెరిగాయనుకో. మరో కొత్త పెంకును వెతుక్కుని వెళ్లిపోతాయి. ఇలా హెర్మిట్ జాతి పీతలు జీవితాంతం చేస్తూనే ఉంటాయి. ఆలోచించండి. మనం అలా చేస్తున్నామా? ఒక పెంకును వదిలి దానితో డిటాచ్మెంట్ పాటిస్తూ కొత్త పెంకులోకి వెళుతున్నామా? ఇవాళ కోవిడ్ రోజులు. ఉద్యోగంలో మార్పు ముఖ్యం. మారాల్సి వస్తే ధైర్యంగా మారాలి. కాదు... సేఫ్ జోన్లో ఉండిపోదామని అనుకుంటే ఎదుగుతామా? ఒక పీతకే అంత ధైర్యం ఉంటే మనిషికి ఎంత ధైర్యం ఉండాలి. మారడానికి సిద్ధంగా ఉండండి. కొత్తది వెతకండి. కొత్తది చేయడమే ఎదుగుదల’... ఈ కథ చెప్పాక ఉద్యోగులలో ఒక ధైర్యం వచ్చే అవకాశం ఉంది. ‘పరిస్థితిని బట్టి మీ కుటుంబ సభ్యులను, ఆఫీస్ బాస్‌ను, కలీగ్స్‌ను ఒప్పించడానికి సరైన కథ చెప్పండి. లేదా మీకు మీరే ఒక కథ చెప్పుకుని సందర్భాలకు సిద్ధం కండి’ అంటుంది మోనికా టాండన్. ఢిల్లీ సమీపంలో ఉన్న గుర్గావ్లో ఆమె సంస్థ ఉంది. దాని పేరు ‘కథా పచ్చీస్’. అది ఒక స్టోరీ బ్యాంక్. జీవితంలో సరైన పదాలతో సరైన కమ్యూనికేషన్ చేస్తే ఎదుటివారి మనసు గెలుచుకోవచ్చని ఈ సంస్థ నమ్ముతుంది. టీచర్లు, బిజినెస్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, యువ నాయకులు, తల్లిదండ్రులు.. అందరూ సరిగ్గా ఒక కథ చెప్పడం నేర్చుకుంటే సరిగ్గా తాము చెప్పాలనుకున్నది ఎదుటివారికి చెప్పగలరని అంటుంది మోనికా టాండన్. హెచ్ఆర్ రంగంలో 15 ఏళ్ల పాటు పని చేసిన టాండన్ ఆ ఉద్యోగంలో ఎక్సయిట్ చేసేది ఏమీ లేదని అర్థమయ్యి ఆ ‘పాత పెంకును’ వదిలి స్టోరీటెల్లర్‌గా కొత్త పెంకులోకి వచ్చింది. ‘కథ చెప్పడం ఆదిమ కళ. ఒక కథ చెప్పనా అనగానే ఎదుటి మనిషి ఎలాంటివాడైనా ఊ కొట్టడానికి రెడీ అయిపోతాడు. గొప్ప గొప్ప నాయకులు ప్రజలకు తమ ప్రసంగాల్లో కథలూ కాకరకాయలు చెబుతారు. కార్పొరేట్ అధిపతులు తమ ఉద్యోగులను మోటివేట్ చేయడానికి కథలు చెబుతారు. బో«ధకులు కూడా విద్యార్థులను ఆకర్షించడానికి కథలు చెబుతారు. అంతెందుకు? రాత్రిపూట రకరకాల కథలు చెప్పే తల్లిదండ్రులను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. కథను ఎలా వదలుకుంటాం. ఇది సావధాన కొరత ఉన్న ప్రపంచం. అంటే మనం చెప్పేదానికి ఎవరూ అటెన్షన్ ఇవ్వడం లేదు. ఏ ఫోన్లోనో తల దూర్చి ఉంటారు. వారిని దారిలోకి తెచ్చుకోవాలంటే కథ చెప్పడమే మార్గం’ అంటుంది మోనికా టాండన్. సేల్స్‌లో లక్ష్యాలు ఉన్న ఉద్యోగులు ఆ లక్ష్యాలు సాధించగలమా లేదా అనుకుంటూ ఉంటే మోనికా వారికి దశరథ్ మాంజీ కథ చెబుతుంది. ‘బిహార్‌లోని గయాలో కొండను పిండి కొట్టి ఆ నిరుపేద గ్రామీణుడు దారి వేశాడు. 22 ఏళ్ల పాటు ఉత్త చేతులతో అతడా పని చేశాడు. మీరు మీ లక్ష్యాలను సాధించగలరు... ఈ కథను పదే పదే తలుచుకుంటే’ అంటుందామె. ‘ఒక కాలు కోల్పోయిన అరుణిమ సిన్హా నిరాశలో కూరుకుపోలేదు. ప్రపంచంలోని అన్ని పర్వతాలను ఎక్కింది. ఎవరెస్ట్ ఎక్కిన తొలి దివ్యాంగ మహిళగా రికార్డు స్థాపించింది. మనకు ఆమె స్ఫూర్తి’ అంటుంది. చిన్నప్పుడు అవ్వ చెప్పే కథల్లో ‘ఏ దిక్కైనా వెళ్లు... ఉత్తరం దిక్కు తప్ప’ అని పూటకూళ్లామె అంటే రాకుమారుడు ఉత్తరం దిక్కుకే వెళతాడు. ఆ దారిలో ప్రమాదాలు ఉన్నా వాటిని దాటి ఊహించని లాభాలు పొందుతాడు. ఇంట్లో పిల్లలు అలా కథలతో ధైర్యం తెచ్చుకునేవారు. కథలతో, ఘటనలతో నూరి పోసే విషయాలు జ్ఞాపకం ఉంటాయి అంటుంది టాండన్. అందుకే కథల బ్యాంకు తెరిచి ప్రతి కథను విలువైన మణిగా ఆమె భావిస్తుంది. తల్లి చెప్పిన కథలు విని శివాజీ వీరుడయ్యాడు. జీవితంలో కష్టాలపై విజయం సాధించే వీరులం కావాలంటే... ఉపాధిలో సవాళ్లను ఎదిరించే వీరులం కావాలంటే కథ డాలుగా... ఖడ్గంగా ఉపయోగపడుతుంది. ఫోన్ పక్కన పెట్టండి. ఏదైనా కథ వినండి. -
మోనిక దారుణ హత్య
టీనగర్: గోవాలో సుగంధ ద్రవ్యాల తయారు చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గోవాలో కలాన్క్యూట్ బీచ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో సంగోల్టా ఉంది. ఇక్కడున్న ఒక అపార్ట్మెంట్ లో మోనిక(39) అనే మహిళ ఒంటరిగా నివసిస్తున్నారు. గతంలో చాయాగ్రాహకురాలిగా పనిచేసిన ఈమె అనంతరం సెంట్స్ తయారీపై విదేశాల్లో విద్య నభ్యసించారు. ఈమె తయారు చేసే సెంట్స్‌కు భారత్, అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఇదిలావుండగా గురువారం రాత్రి ఈమె ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బెడ్‌పై కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం పడివుందని, ఆమెపై అత్యాచారం జరిపిన అనంతరం హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. దీంతోపాటు హంతకుడు ఇంట్లో నగలు, నగదు దోచుకువెళ్లినట్లు తెలిపారు. మృతురాలు చెన్నై ఫొటోగ్రాఫర్ సతీమణి: హత్యకు గురైన మోనిక చెన్నైకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ సతీ మణిగా తెలిసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఈమె చెన్నైకు చెందిన ఫొటోగ్రాఫర్ భరత్ రామామృతం(58) వద్ద సహాయకురాలిగా చేరింది. ఆ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారడంతో 2004లో వివాహం చేసుకున్నారు. 2011లో గోవాలో నివాసం ఏర్పరచుకున్న వీరు ఏడాది క్రితం అభిప్రాయభేదాలు ఏర్పడడంతో విడిపోయారు. వీరింకా విడాకులు కూడా తీసుకోలేదు. వీరికి సంతానం లేదు. మోనిక హత్య సమయంలో భరత్ చెన్నైలో ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు భరత్వద్ద విచారణ జరుపుతున్నారు. -
పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక!
జడలో పూలు, మెడలో నగలతో ఆడవేషం ధరించి చాలా గ్యాంగ్ స్టర్ నయీం పోలీసులను బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే. అచ్చం నయీం లాగే ఈ కేడీ మోనిక పోలీసులను బోల్తా కొట్టించింది. పెదవులకు లిప్‌స్టిక్, బుగ్గలకు మేకప్, సన్నని కనుబొమ్మలు, వయ్యారంగా చీర కట్టి అచ్చం మహిళలాగా వ్యవహరిస్తూ.. అక్రమ దందాలకు తెరతీసింది. మహిళలకు ఏమాత్రం తీసిపోనిరీతిలో ముస్తాబై మోనిక సాగిస్తున్న నకిలీ పత్రాల రాకెట్‌ను తాజాగా బిహార్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ రాకెట్‌ను నడిపిస్తున్నది మోనిక కాదు.. ఆ పేరుతో ఆడవేషంలో తిరుగుతున్న అవినాష్ అని తెలిసి పట్నా పోలీసులు షాక్ తిన్నారు. తవ్వితీస్తున్న కొద్దీ ఎన్నో అక్రమాలు వెలుగుచూస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. మోనిక పేరుతో అవినాష్ అలియాస్ గోల్డీ ముఠా చాలా అక్రమాలే సాగిస్తున్నది. ఆధార్ కార్డులు మొదలు పదో తరగతి, డిగ్రీ, పీజీ, డిప్లమా, బీఈడీ, జేఈ, ఐటీఐ ఇలా ఏ నకిలీ పత్రం కావాలన్నా మోనికా ముఠా చిటికెలో సృష్టిస్తూ మోసం చేస్తున్నది. ఇందుకోసం రూ. 500 నుంచి రూ. 20వేల ఈ ముఠా తీసుకుంటుంది. అంతేకాదు బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికైనా మద్యం కావాలంటే ఈ ముఠానే అందిస్తున్న ఉన్నది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే యువత లక్ష్యంగా ఈ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ముఠా చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి.. మోనికా అమ్మాయి కాదు.. పరుషుడు అంటూ ఇచ్చిన సమాచారంతో అతని గుట్టు రట్టయింది. ప్రస్తుతం అవినాష్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నదిగళ్ ననైవదిల్లైకు ప్రశంసలు
నదిగళ్ ననైవదిల్లై చిత్రం సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. నాంజిల్ పీసీ అన్భళగన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ప్రణవ్, మోనిక, రిషే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. కాగా చిత్రాన్ని సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్, గాయకుడు ఏసుదాస్ తదితర ప్రముఖులు నదిగళ్ ననైవదిల్లై చిత్రం చాలా బాగుందంటూ ప్రశంశల వర్షం కురిపించారు. చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, పాటలు, సంగీతం అభినందించతగ్గవిగా ఉన్నాయని ఏసుదాస్ వ్యాఖ్యానించారు. ఎస్పీ ముత్తురామన్ మాట్లాడుతూ నదిగళ్ ననైవదిళ్లై మంచి కథా బలం వున్న చిత్రం అని ప్రశంసించారు. ఈ తరం యువత ప్రేమను చక్కగా చెప్పారన్నారు. చిత్రంలో మదురై ముత్తు హాస్యం పండిందన్నారు. పలువురు ప్రముఖులు మంచి చిత్రం అంటూ నదిగళ్ ననైవదిళ్లై చిత్ర యూనిట్‌ను అభినందించారు. -
చార్మినార్ వద్ద చిన్నారి కిడ్నాప్...పోలీసుల వేట
హైదరాబాద్ : పాతబస్తీ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది. హైకోర్టు ఆరో గేట్ సమీపంలో టీకొట్టు నడుపుకుంటున్న విష్ణు కుమార్తె మోనిక(2)ను ఆగంతకుడు అపహరించుకుని పోయాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా గమనించిన విష్ణు... పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజిలను పరిశీలించి... నిందితుడిని పోలీసులు గుర్తించారు. కిడ్నాపైన చిన్నారి మోనికను రక్షించేందుకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. -
నటి మోనిక వివాహ వేడుక
-
మోగింది పెళ్లి బాజా!
‘చంటి’ తదితర చిత్రాల్లో బాల తారగా కనిపించి, అటుపై ‘శివరామరాజు’ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించిన మోనికా గుర్తుంది కదూ! తెలుగులో ‘మా అల్లుడు వెరీగుడ్డు’తో పాటు పలు చిత్రాల్లో కథానాయికగా చేశారామె. గత ఐదారేళ్లుగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైన మోనిక త్వరలో ఇల్లాలు కాబోతోంది. ఈ నెల 11న మాలిక్ అనే వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి జరగనుంది. గత ఏడాది ఇస్లాం మతానికి మారి, తన పేరుని రహీమాగా మార్చుకున్నారు మోనిక. మాలిక్ ముస్లిమ్ కాబట్టి, తనకోసమే మార్చుకుందని అప్పట్లో ఓ వార్త వచ్చింది. అయితే, ఆ సంప్రదాయం అంటే ఇష్టం కాబట్టే మారానని ఆమె పేర్కొన్నారు. ఆ సంగతలా ఉంచితే... మాలిక్‌తో ఆమె పెళ్లి ఇస్లాం పద్ధతిలో జరగనుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని మోనిక నిర్ణయించుకున్నారు. -
చిత్రమైన పాత్రలో...
ధన్‌రాజ్, మోనిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నా కర్మ కాలిపోయింది’. చిన్ని దర్శకుడు. ఇక్బాల్ నిర్మాత. ఘనశ్యామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బసిరెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని కె.సురేశ్‌బాబుకి అందించారు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. భయపెడుతూ నవ్వించే చిత్రమైన పాత్రను ఇందులో చేస్తున్నాననీ, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉందనీ ధన్‌రాజ్ చెప్పారు. తాను చెప్పిన సింగిల్ సీన్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న ధన్‌రాజ్‌కి కృతజ్ఞతలని దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
మతం మార్చుకున్న మోనిక
తమిళ చిత్రాల్లో పేరు తెచ్చుకున్న నటి మోనిక ఇప్పుడు ఇస్లామ్ మతం స్వీకరించారు. అందుకు తగ్గట్లే తన పేరును ఎం.జి.రహీమాగా మార్చుకున్నారు. ఇకపై, సినిమాల్లో నటించనంటూ, నటనకు గుడ్‌బై చెప్పేశారు. ఈ హఠాత్పరిణామానికి కారణం ఏమిటన్నది ఆమె చెప్పలేదు కానీ, మతం మార్చుకున్న విషయాన్ని శుక్రవారం నాడు చెన్నైలో పత్రికా విలేకరులకు తెలియజేశారు. చిన్న వయసులోనే బాలనటిగా మొదలుపెట్టి నాయిక పాత్రల దాకా ఎదిగిన మోనిక తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70 దాకా చిత్రాల్లో నటించారు. ‘‘బాల నటిగా మొదలైన నేను ఇన్నేళ్ళుగా సినీ రంగంలో విజయవంతంగా కొనసాగడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ రంగాన్ని వదిలివెళ్లడం కష్టంగా ఉన్నా, తప్పడం లేదు’’ అని ఆమె ప్రకటించారు. అదే సమయంలో, ‘‘డబ్బు కోసమో, ఏదో ప్రేమ వ్యవహారం కోసమో నేను మతం మార్చుకోలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇస్లామ్‌లోని అంశాలు నచ్చడం వల్లే మతం మారాను’’ అని మోనిక వివరించారు. పెళ్ళి గురించి వివరాలను త్వరలోనే చెబుతానని ఆమె అన్నారు. వెంకటేశ్ సూపర్ హిట్ ‘చంటి’ (1991)లో, తమిళ ‘సతీ లీలావతి’ (’95)లో బాల నటిగా చేసిన మోనిక పెద్దయ్యాక తెలుగులో ‘శివరామరాజు’, ‘మా అల్లుడు వెరీగుడ్’, ‘కొడుకు’, ‘పైసాలో పరమాత్మ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. సినిమాల్లోకి వచ్చాక మోనికగా పేరు మార్చుకున్న రేఖా మారుతీరాజ్ ఇప్పుడిలా ఇస్లామ్ మతం పుచ్చుకోవడంతో మరోసారి పేరు మారినట్లయింది. -
ర్యాంప్అందాల పూలదారి
సరిగ్గా రెండ్రోజుల క్రితం గ్లామర్ పపంచంలో భారతీయ అందం మరోసారి త‘లుక్’మంది. ఏకంగా అమెరికా దేశపు అందాల కిరీటాన్ని స్వంతం చేసుకున్న విజయవాడ అమ్మాయి నీనా దావులూరి మరోసారి మన గ్లామర్ సత్తాను ప్రపంచానికి చాటింది. రకరకాల భయాలను, బిడియాలను త్వరత్వరగా వదుల్చుకుంటున్న తెలుగమ్మాయిలు మోడలింగ్‌లో రాణిస్తున్నారు. మరెందరో అమ్మాయిలు ‘మోడల్స్’గా మెరిసేందుకు రాచబాట పరుస్తున్నారు. మోడలింగ్ అంటే అదేదో కేవలం అందాల ప్రదర్శన మాత్రమే అనుకునేవారు ఒకప్పుడు. అయితే మిగిలిన అన్ని రంగాల తరహాలోనే అటు అందం ఇటు ఆత్మ విశ్వాసం, తెలివితేటలు అన్నీ ఉంటేనే మోడల్‌గా వెలుగొందడం సాధ్యమని గ్రహిస్తున్నారు. మోడల్‌గా మంచి అవకాశాలు దక్కించుకోవడం అనేది సినిమాలకు రెడ్‌కార్పెట్ అని కూడా అర్థం అవడంతో ఇటువైపు రావడానికి మరింతమంది ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న కొందరు హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక మోడల్స్‌ను పలకరించినప్పుడు ఇలా స్పందించారు. - ఎస్. సత్యబాబు ఎన్నో రిహార్సల్స్... కంప్యూటర్సైన్స్లో ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఒక మంచి జాబ్ ఎంత అవసరమో మనల్ని మనం ఇతరత్రా నిరూపించుకునే యాక్టివిటీ కూడా అంతే అవసరం కదా! అలాంటిదే మోడలింగ్. చదువుతో పాటు, జాబ్ చేస్తూనే మానసిక సంతృప్తి కోసం మోడల్‌గానూ కొనసాగాలనేది నా ఆశయం. పెద్ద సంఖ్యలో జనం మనల్ని చూస్తూ హర్షధ్వానాలు చేస్తుంటే వచ్చే ఆనందం వేరు కదా! ఆ ఆనందాన్ని పొందేందుకే మోడల్‌గా మారాను. అయితే జనం ముందు కనపడే ఆ మెరుపుల వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ర్యాంప్ మీద మెరిసేందుకు ఎన్నోసార్లు రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిచేసినా ఒక్కసారి టాప్ మోడల్ అనిపించుకుంటే ఇక అన్నీ మర్చిపోతాం. తప్పనిసరిగా వారంలో ఐదు రోజుల పాటు రోజుకు గంటన్నర చొప్పున వ్యాయామం చేయడం దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్లామర్ రంగంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం దాకా మా గెలుపు వెనుక ఎంతో కృషి ఉంటుంది. ఈ రంగంలో నన్ను ఎంతమంది నిరుత్సాహపరచాలని చూసినా మా అమ్మ మాత్రం ప్రోత్సహించింది. టీవీలో, మేగ్జైన్లో, షోస్‌లో నన్ను చూసినప్పుడల్లా చుట్టుపక్కలవారికి చూపించి మురిసిపోతుంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ తరహాలో ఈ రంగంలో నా ప్రస్థానాన్ని సాగించాలనుకుంటున్నాను. - మోనిక.టి ఏ రంగంలో పనిచేసినా... మోడలింగ్‌ను దేనితోనూ పోల్చలేం. ఎందుకంటే అందులో ఉండే గ్లామర్, ఆ రంగానికి ఉన్న ఆకర్షణ అలాంటివి. ప్రస్తుతం ప్రముఖ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తున్నాను. టీనేజ్ నుంచి ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లో ప్రయత్నాలు ప్రారంభించాను. ఈ ప్రొఫెషన్లో రాణించడానికి చక్కని ఫిజిక్ తప్పనిసరి. దీనికోసం ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లడం, డైట్ ఫాలో అవడం చేస్తున్నాను. ఫిజికల్ ట్రైనర్ కూడా ఉన్నారు. ఈ రంగం మీద ఉన్న రకరకాల వ్యాఖ్యానాలను పట్టించుకోకుండా మా తల్లిదండ్రులు నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుండడం నా అదృష్టం. వారే నాకు ప్రథమ విమర్శకులు కూడా. ఏ రంగంలో ఉన్నా మన విద్యార్హతలను ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిందే! ఆ క్రమంలోనే నేను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లీష్) చేస్తున్నాను. - వింధ్య అందచందాలు మాత్రమే సరిపోవు... ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తున్నాను. గ్లామర్ రంగంలో అందం అనేది ఒక ప్రాథమిక అర్హత మాత్రమే. చూడచక్కని రూపంతో బాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం వంటివి సైతం ఉంటేనే గ్లామర్ రంగంలో ఎదగగలం. నేను ఈ రంగానికి వచ్చి రెండేళ్లవుతోంది. చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌లోకి రావాలనుకుని దానికి అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద్‌లోని లఖోటియా మోడలింగ్ ఇన్స్టిట్యూట్లో జేరాను. శిక్షణానంతరం ప్రసాద్ బిడప్ప మోడలింగ్ హంట్‌లో పాల్గొన్నాను. గత జూలైలో జరిగిన లఖోటియా ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాను. ప్రస్తుతం పలు సంస్థల ఫొటో షూట్స్‌లో పాల్గొంటున్నాను. పలు బ్రాండ్స్‌కు వర్క్ చేస్తున్నాను. ర్యాంప్ షోలలో పాల్గొంటున్నాను. టాప్ మోడల్‌గా ఎదగాలని, బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవాలని ఆశిస్తున్నాను. - ప్రియాంక