చిత్రమైన పాత్రలో... | naa karma kaali poyindi movie audio released | Sakshi
Sakshi News home page

చిత్రమైన పాత్రలో...

Published Sun, Nov 23 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

చిత్రమైన పాత్రలో...

చిత్రమైన పాత్రలో...

 ధన్‌రాజ్, మోనిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నా కర్మ కాలిపోయింది’. చిన్ని దర్శకుడు. ఇక్బాల్ నిర్మాత. ఘనశ్యామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బసిరెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని కె.సురేశ్‌బాబుకి అందించారు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. భయపెడుతూ నవ్వించే చిత్రమైన పాత్రను ఇందులో చేస్తున్నాననీ, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందనే నమ్మకం ఉందనీ ధన్‌రాజ్ చెప్పారు. తాను చెప్పిన సింగిల్ సీన్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న ధన్‌రాజ్‌కి కృతజ్ఞతలని దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement