చైనా నుంచి మనూస్‌ ఏఐ  | New Chinese AI agent Manus rewrites autonomy rulebook | Sakshi
Sakshi News home page

చైనా నుంచి మనూస్‌ ఏఐ 

Published Mon, Mar 10 2025 6:23 AM | Last Updated on Mon, Mar 10 2025 6:23 AM

New Chinese AI agent Manus rewrites autonomy rulebook

నూతన కృత్రిమ మేధ మోడల్‌ ఆవిష్కరణ  

బీజింగ్‌:  కొన్ని రోజుల క్రితం ‘డీప్‌సీక్‌’కృత్రిమ మేధ(ఏఐ) మోడల్‌ను తీసుకొచ్చి ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టించిన డ్రాగన్‌ దేశం చైనా మరో సంచలనానికి తెరతీసింది. ‘మనూస్‌’పేరిట మరో కృత్రిమ మేధ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వాడుకలో ఉన్న అగ్రశ్రేణి ఏఐ వేదికలకు దీటుగా మనూస్‌ను రూపొందించారు. చైనాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘మొనికా’ఈ మనూస్‌ను అభివృద్ధి చేసింది. ‘ఆలోచనలు, చర్యలకు మధ్య వారధిగా పని చేస్తుంది. ఇది కేవలం ఆలోచించడమే కాదు, ఫలితాలు సాధించి చూపుతుంది’’అని మొనికా కంపెనీ వెల్లడించింది. 

ఈ నూతన ఏఐ ఏజెంట్‌ వినియోగదారులకు చక్కటి అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేసింది. కొత్త వెబ్‌సైట్లను రూపొందించడం నుంచి విహార యాత్రలకు ప్లానింగ్‌ చేయడం దాకా ఎన్నో రకాల పనులను మనూస్‌ చక్కబెడుతుంది. స్టాక్‌ మార్కెట్‌ను విశ్లేషించడంలో బహు నేర్పరి. కేవలం ఒక ఆదేశం ఇచ్చేస్తే చాలు మనకు కావాల్సిన పనులు పూర్తిచేస్తుంది. మనూస్‌ తనంతట తాను ఆలోచించుకోగలదు. ప్లాన్‌ చేసుకొని దాన్ని అమలు చేయగలదు. స్వయం చాలితం అని చెప్పొచ్చు. మనూస్‌ను ఈ నెల 6వ తేదీన ఆవిష్కరించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.  

ఏమిటీ మనూస్‌?  
ఇదొక జనరల్‌ ఏఐ ఏజెంట్‌. వేర్వేరు రంగాలకు సంబంధించి సంక్లిష్టమైన, రియల్‌–వరల్డ్‌ పనులు పూర్తిచేయగలదు. సాధారణ ఏఐ చాట్‌బాట్స్‌ తరహాలో కాకుండా విభిన్నంగా పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి అటనామిస్‌ సిస్టమ్‌. ప్రణాళిక, కార్యాచరణ, ఫలితాలు... అనే శ్రేణిలో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు గ్లోబల్‌ వార్మింగ్‌పై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సూచించామనుకోండి. ఆ అంశంపై మనూస్‌ తనంతట తానే పరిశోధన సాగిస్తుంది. పేపర్‌పై నివేదికను సిద్ధం చేసి మనకు అందజేస్తుంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement