పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక! | Bihar Police arrested con man | Sakshi
Sakshi News home page

పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక!

Published Sat, Sep 24 2016 3:49 PM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM

పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక! - Sakshi

పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక!

జడలో పూలు, మెడలో నగలతో ఆడవేషం ధరించి చాలా గ్యాంగ్‌ స్టర్‌ నయీం పోలీసులను బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే. అచ్చం నయీం లాగే ఈ కేడీ మోనిక పోలీసులను బోల్తా కొట్టించింది. పెదవులకు లిప్‌స్టిక్‌, బుగ్గలకు మేకప్‌, సన్నని కనుబొమ్మలు, వయ్యారంగా చీర కట్టి అచ్చం మహిళలాగా వ్యవహరిస్తూ.. అక్రమ దందాలకు తెరతీసింది. మహిళలకు ఏమాత్రం తీసిపోనిరీతిలో ముస్తాబై మోనిక సాగిస్తున్న నకిలీ పత్రాల రాకెట్‌ను తాజాగా బిహార్‌ పోలీసులు బట్టబయలు చేశారు.

ఈ రాకెట్‌ను నడిపిస్తున్నది మోనిక కాదు..  ఆ పేరుతో ఆడవేషంలో తిరుగుతున్న అవినాష్‌ అని తెలిసి పట్నా పోలీసులు షాక్‌ తిన్నారు. తవ్వితీస్తున్న కొద్దీ ఎన్నో అక్రమాలు వెలుగుచూస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. మోనిక పేరుతో అవినాష్‌ అలియాస్‌ గోల్డీ ముఠా చాలా అక్రమాలే సాగిస్తున్నది. ఆధార్‌ కార్డులు మొదలు పదో తరగతి, డిగ్రీ, పీజీ, డిప్లమా, బీఈడీ, జేఈ, ఐటీఐ ఇలా ఏ నకిలీ పత్రం కావాలన్నా మోనికా ముఠా చిటికెలో సృష్టిస్తూ మోసం చేస్తున్నది. ఇందుకోసం రూ. 500 నుంచి రూ. 20వేల ఈ ముఠా తీసుకుంటుంది. అంతేకాదు బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికైనా మద్యం కావాలంటే ఈ ముఠానే అందిస్తున్న ఉన్నది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే యువత లక్ష్యంగా ఈ రాకెట్‌ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ముఠా చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి.. మోనికా అమ్మాయి కాదు.. పరుషుడు అంటూ ఇచ్చిన సమాచారంతో అతని గుట్టు రట్టయింది. ప్రస్తుతం అవినాష్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement