Patna police
-
నిరుద్యోగిపై డిప్యూటీ కలెక్టర్ దాష్టీకం.. లాఠీతో చితకబాది, ఈడ్చుకెళ్లి..!
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో నిరుద్యోగులు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వారని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావాహులపై జల ఫిరంగాలు ప్రయోగించారు. జాతీయ జెండాను పట్టుకున్న ఓ యువకుడిని డిప్యూటీ కలెక్టర్ లాఠీతో కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరోవైపు.. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ, అగ్నిపత్ పథకాలను నిరసిస్తూ జన్ అధికార్ పార్టీ లోక్తాంత్రిక్ ఆందోళనకు దిగినట్లు పలువురు పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలు చేపట్టినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నిరసనల సందర్బంగా పాట్నా డిప్యూటీ కలెక్టర్ ఓ యువకుడిని తీవ్రంగా కొట్టటం, రోడ్డుపై ఈడ్చుకెళ్లటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పాట్నా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కేకే సింగ్.. నిరసనకారులను కిందపడేసి కొట్టారు. జాతీయ జెండా పట్టుకున్న యువకుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 20 लाख नौकरियाँ देने की बात करने वाले नीतीश कुमार की पुलिस ने पटना में प्रदर्शन कर रहे शिक्षक अभ्यर्थी को अमानवीय तरीके से मारा। बिहार की सरकार और उसके अधिकारी ने न सिर्फ शिक्षक के चेहरा को लहूलुहान कर दिया बल्कि तिरंगे का भी अपमान किया। यही है जेडीयू-राजद सरकार का असली चेहरा… pic.twitter.com/7r75xHoOYU — Amit Malviya (@amitmalviya) August 22, 2022 మరోవైపు.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ కొత్త ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించనుందని ప్రకటించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఈ క్రమంలో నిరుద్యోగులు నిరసనలు దిగటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్ అధికార కూటమిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇచ్చిన హామీని నెరవేర్చలేకే నిరుద్యోగులపై లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు బీజేపీ నేత షేహజాద్ పూనావాలా. తన హామీపై ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. #WATCH | Bihar: Jan Adhikar Party Loktantrik holds a protest march against inflation, GST and Agnipath scheme, in Patna. Police used water cannons to disperse the crowd. pic.twitter.com/vJQsrxAqbp — ANI (@ANI) August 22, 2022 ఇదీ చదవండి: బీహార్ సీఎం నితీష్‌కు బిగ్ షాక్.. దాడి చేసిన 13 మంది అరెస్ట్.. వీడియో వైరల్ -
పోలీసులకు షాకిచ్చిన కేడీ మోనిక!
జడలో పూలు, మెడలో నగలతో ఆడవేషం ధరించి చాలా గ్యాంగ్ స్టర్ నయీం పోలీసులను బోల్తా కొట్టించిన సంగతి తెలిసిందే. అచ్చం నయీం లాగే ఈ కేడీ మోనిక పోలీసులను బోల్తా కొట్టించింది. పెదవులకు లిప్‌స్టిక్, బుగ్గలకు మేకప్, సన్నని కనుబొమ్మలు, వయ్యారంగా చీర కట్టి అచ్చం మహిళలాగా వ్యవహరిస్తూ.. అక్రమ దందాలకు తెరతీసింది. మహిళలకు ఏమాత్రం తీసిపోనిరీతిలో ముస్తాబై మోనిక సాగిస్తున్న నకిలీ పత్రాల రాకెట్‌ను తాజాగా బిహార్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ రాకెట్‌ను నడిపిస్తున్నది మోనిక కాదు.. ఆ పేరుతో ఆడవేషంలో తిరుగుతున్న అవినాష్ అని తెలిసి పట్నా పోలీసులు షాక్ తిన్నారు. తవ్వితీస్తున్న కొద్దీ ఎన్నో అక్రమాలు వెలుగుచూస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. మోనిక పేరుతో అవినాష్ అలియాస్ గోల్డీ ముఠా చాలా అక్రమాలే సాగిస్తున్నది. ఆధార్ కార్డులు మొదలు పదో తరగతి, డిగ్రీ, పీజీ, డిప్లమా, బీఈడీ, జేఈ, ఐటీఐ ఇలా ఏ నకిలీ పత్రం కావాలన్నా మోనికా ముఠా చిటికెలో సృష్టిస్తూ మోసం చేస్తున్నది. ఇందుకోసం రూ. 500 నుంచి రూ. 20వేల ఈ ముఠా తీసుకుంటుంది. అంతేకాదు బిహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికైనా మద్యం కావాలంటే ఈ ముఠానే అందిస్తున్న ఉన్నది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే యువత లక్ష్యంగా ఈ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ముఠా చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి.. మోనికా అమ్మాయి కాదు.. పరుషుడు అంటూ ఇచ్చిన సమాచారంతో అతని గుట్టు రట్టయింది. ప్రస్తుతం అవినాష్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.