చైనా షాపింగ్లో షాకింగ్ ఘటన | Terrifying moment loaded supermarket trolley crashes | Sakshi
Sakshi News home page

చైనా షాపింగ్లో షాకింగ్ ఘటన

Published Tue, Mar 8 2016 12:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

చైనా షాపింగ్లో షాకింగ్ ఘటన

చైనా షాపింగ్లో షాకింగ్ ఘటన

బీజింగ్: అది చైనాలోని హార్బిన్ నగరం. ఎప్పుడూ రద్దీగా ఉండే ఓ పెద్ద వ్యాపార సముదాయం. తన నాలుగేళ్ల కూతురితో కలిసి ఓ తల్లి షాపింగ్కు వెళ్లింది. కాసేపు షాపింగ్ మాల్ మొత్తం తిరిగి తనకు కావాల్సిన వస్తువులు తీసుకుంది. అనంతరం ఆపాప చేయిపట్టుకొని ఎస్కలేటర్ ద్వారా కిందికి వస్తోంది. ఆ సమయంలోనే అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది.

షాపింగ్ మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వివిధ వస్తువులతో లోడ్ చేసి పెద్దమొత్తం బరువుతో ఉన్న ట్రాలీ.. ఎస్కలేటర్పై నుంచి వచ్చి అమాంతం ఆ తల్లీ కూతుళ్లను ఢీకొట్టింది. ఆ దెబ్బకు వారిద్దరు బలంగా నేలపై పడి గాయాలయ్యాయి. ఈ ఘటనకు కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ప్రకారం తెల్లగౌను వేసుకున్న నాలుగేళ్ల పాప షుంగ్యాన్ అనే తన తల్లి చేయిపట్టుకుని చుట్టూ చూసుకుంటూ ఎస్కలేటర్ దిగుతోంది. అదే సమయంలో కూల్ డ్రింక్స్తో నింపిన ఓ భారీ ట్రాలీ వచ్చి అమాంతం ఢీకొట్టింది. దీంతో వారు కిందపడగా ఇద్దరి తల ముందుభాగం పగిలింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement