సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ జీఎస్టీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్‌లపై తూనికలు, కొలతలశాఖ కొరడా ఝులిపించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఇప్పటికీ పాత ధరలకే విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
జీఎస్టీ పేరుతో పలు సరుకు లను అధిక ధరలకు విక్రయిస్తున్నందుకు గానూ రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై 18, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై 13, మోర్ సూపర్ మార్కెట్‌పై 5, స్పెన్సర్స్‌పై 7, బిగ్‌బజార్‌పై 15, విజేత సూపర్ మార్కెట్, మహావీర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, బిగ్‌సీ, హైపర్ మార్కెట్లపై కేసులు నమోదు చేశారు.
తూనికలశాఖలో పదోన్నతులు..
తూనికలు, కొలతలశాఖలో 12 మంది ఇన్‌స్పెక్టర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ కంట్రోలర్ అకున్‌సబర్వాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్లుగా ఉన్న వారిని జిల్లా తూనికలు, కొలతల అధికారి (డీఎల్‌ఎంవో)గా పదోన్నతి కల్పించారు. పదోన్నతులు పొందిన వారిలో బి.ప్రవీణ్ కుమార్, శ్రీవల్లి, డి.సరోజ, మొహమ్మద్ సుజాత్ అలీ, కె.రామ్మోహన్, ఎన్. సంజయ్‌కృష్ణ, బి.భూలక్ష్మి, పి.శ్రీనివాస్ రెడ్డి, జి.అశోక్‌బాబు, పి.రవీందర్, ఎండీ రియాజ్ అహ్మద్‌ఖాన్, ఎంఏ జలీల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment