ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థగా విశాల్‌మార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రాబోతున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్ 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల) నిధుల సమీకరణ కోసం తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రానుందని సమాచారం.
విశాల్‌మార్కెట్ పలు నగరాల్లో 560 సూపర్‌మార్కెట్లు నిర్వహిస్తోంది. ఈ సంస్థ విలువను 5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) పరిగణించి, ఐపీఓకు రావాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్‌లో స్విట్జర్లాండ్ పార్ట్‌నర్స్ గ్రూప్ పీజీహెచ్‌ఎన్.ఎస్, మన దేశానికి చెందిన కేదారా క్యాపిటల్‌కు కలిపి మెజార్టీ వాటా ఉంది. ఐపీఓలో ఈ రెండు సంస్థలు షేర్లు విక్రయిస్తాయని తెలుస్తోంది.
ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే..
ఈ రెండు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు కలిపి విశాల్ మెగామార్ట్‌లో ఎంత వాటా కలిగి ఉన్నాయి? ఎంతమేరకు విక్రయిస్తాయనేది తెలియాల్సి ఉంది. విశాల్ మెగామార్ట్ సీఈఓ గుణేందర్ కపూర్ ఐపీఓ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment