చోరీ చేస్తూ దొరికిన మహిళా పోలీస్‌..అంతలోనే ట్విస్ట్! | Chennai policewoman seen shoplifting in supermarket | Sakshi
Sakshi News home page

చోరీ చేస్తూ దొరికిన మహిళా పోలీస్‌..అంతలోనే ట్విస్ట్!

Jul 26 2018 11:56 AM | Updated on Mar 21 2024 8:47 PM

దొంగలను పట్టుకోవాల్సిన ఓ మహిళా పోలీసే దొంగలా మారింది. అంతే కాకుండా చోరీ చేస్తుంటే ప్రశ్నించినందుకు.. తననే నిలదీస్తావా అంటూ భర్తతో కొట్టించింది. ఈ సంఘటన చెన్నైలోని చెట్‌పేట్‌లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. సూపర్‌ మార్కెట్‌లో మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వస్తువులను జేబులో పెట్టడాన్ని అక్కడే పనిచేస్తున్న ప్రణవ్‌ గమనించాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చోరీ చేసిన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరాడు. అంతేకాకుండా తప్పు చేసినట్టు క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలన్నాడు. మహిళా పోలీసు తన భర్తకు విషయం చెప్పడంతో అతను మరికొందరిని తన వెంట వేసుకొని సూపర్‌ మార్కెట్‌పై దాడి చేశాడు. ప్రణవ్‌ను ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంతో చెన్నై పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement