వాషింగ్టన్ : తప్పుచేసిన వారిపై కఠిన చట్టాలను అమలు చేయడంలో అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. తప్పుచిన్నదైనా, పెద్దదైనా సరే ఏమాత్రం కనికరం లేకుండా కటకటాల వెనక్కి పంపే చట్టాల ఆదేశం ఉన్నాయి. ఈ క్రమంలో సూపర్ మార్కెట్ ఓ యువకుడు సరదా అతని దూల తీర్చింది. ఐస్‌క్రీమ్‌ను సగం తిని తిరిగి ఫ్రిజ్‌లో పెట్టినందుకు న్యాయస్థానం అతడినికి ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.75వేల రూపాయల జరిమానా కూడా విధించింది. అమెరికా మీడియా వెలువరించిన కథనాల ప్రకారం.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆడ్రీన్ ఆండర్సన్ అనే 24 ఏళ్ల యువకుడు వాల్‌మార్ట్ సూపర్ మార్కెట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాడు.
ఈ నేపథ్యంలో అక్కడున్న ఫ్రిజ్‌లో నోరూరుంచే ఐస్‌క్రీమ్ అతని కంటపడింది. కొనుక్కోవడానికి మనోడి దగ్గర డబ్బులులేవో ఏమో.. అనుకున్నదే తడువుగా ఐస్‌క్రీమ్‌ను లాగించేశాడు. సగం తినేసి మిగిలింది ఏమీతెలియనట్లు తిరిగి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఈ తతంగమంతా అతడి స్నేహితులు ఫోన్‌లో వీడియో రికార్డు చేశారు. అంతటితో ఆగకుండా దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదంతా గత ఏడాది ఆగస్ట్‌లో జరిగింది. అదికాస్తా వైరస్‌గా మారడంలో పలువురు వైద్య అధికారులు దానిపై స్పందించి.. సంబంధిత సూపర్‌మార్కెట్‌లో ఫిర్యాదు చేశారు. ఆ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు విచారించిన స్థానిక కోర్టు అతనికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పును వెలువరిచింది.