ఒకే విమానంలో చిరంజీవి, నాగార్జున.. ఎక్కడికి వెళ్లారంటే..? | Chiranjeevi And Nagarjuna Came To Kerala For Dussehra Celebrations, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

ఒకే విమానంలో చిరంజీవి, నాగార్జున.. ఎక్కడికి వెళ్లారంటే..?

Oct 13 2024 5:48 PM | Updated on Oct 14 2024 11:25 AM

Chiranjeevi And Nagarjuna Came To Kerala

టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున  ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. ఆదివారం వారిద్దరూ కలిసి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. దీంతో వారు ఎక్కడికి వెళ్తున్నారంటూ నెటిజన్లు ఆరా తీశారు. మెగాస్టార్‌, కింగ్‌ నాగార్జున నడుచుకుంటూ వెళ్తున్న వీడియో కూడా ఒకటి నెట్టింట వైరల్‌ అయింది. వారి అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు కూడా.

చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి కేరళలోని త్రిశూర్‌ వెళ్లారు. కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత T. S. కళ్యాణరామన్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో జరుగుతున్న దసరా సంబరాల్లో పాల్గొన్నారు. త్రిశూర్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని, ఈ క్రమంలో తమ ఇంట్లో కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తామని కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత ప్రత్యేక ఆహ్వానం పంపడంతో వారిద్దరూ వెళ్లారు. T. S. కళ్యాణరామన్ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర టీజర్‌ తాజాగానే విడుదలైంది. ఇప్పటి వరకు సుమారు 30 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక నాగార్జున కుబేర, కూలీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement