
ఐటీ సిటీ బెంగళూరులోని మారతహళ్లిలో తన కొత్త షోరూమ్‌ను కల్యాణ్ జ్యువెలర్స్ ప్రారంభించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్లు హీరో అక్కినేని నాగార్జున, కన్నడ హీరో శివరాజ్ కుమార్ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో కల్యాణ్ జ్యువెల్లర్స్ చైర్మన్, ఎండీ టీఎస్ కల్యాణరామన్, ఈడీ రమేశ్ కల్యాణరామన్ పాల్గొన్నారు. బెంగళూరులో కల్యాణ్ జ్యువెల్లర్స్ తన తొలి షోరూమ్‌ను 2010లో ప్రారంభించింది. ప్రస్తుతం మారతహళ్లి శాఖతో కలుపుకుని కర్ణాటక వ్యాప్తంగా 14 షోరూమ్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment