
మంచిర్యాల: ప్రముఖ బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆగస్టు 26న మంచిర్యాలలో కొత్త షోరూంను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో ఈ కంపెనీ మొత్తం షోరూంల సంఖ్య పదిహేనుకు చేరింది. కేపీఆర్ ప్లాజా, గంగా రెడ్డి రోడ్, మార్కెట్ ఏరియాలో నిర్మించిన కొత్త షోరూంను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపాలిటీ చైర్మన్ ముకేష్ గౌడ్‌లు ప్రారంభించారు. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అసమానమైన డిజైన్లు, సాటిలేని నాణ్యత, సేవా నైపుణ్యంతో ప్రత్యేక ఆభరణాల షాపింగ్ అనుభూతిని అందిస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment