
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చైన్ జోస్ అలుక్కాస్ రూ.5,500 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీ విస్తరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని ఒక జ్యువెల్లరీ రిటైల్ బ్రాండ్ రానున్న 8 సంవత్సరాల్లో చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమం ఇదని వివరించింది. నిధులు, రియల్టీ సమకూరితే 4 సంవత్సరాల్లోనే తమ విస్తరణ కార్యక్రమం పూర్తవుతుందని వివరించింది.
సంస్థ విస్తరణ ప్రణాళికకు సంబంధించి చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు జాన్ అలుక్కా, వర్గీస్ అలుక్కా, చైర్మన్ జోస్ అలుక్కా, నటుడు ఆర్ మాధవన్, కంపెనీ ఎండీ పాల్ అలుక్కా పాల్గొన్నారు. (చిత్రంలో ఎడమ నుంచి). ప్రస్తుతం 50 స్టోర్లను కలిగిన జ్యువెల్లరీ గ్రూప్ గ్లోబల్ అంబాసిడర్‌గా నటుడు మాధవన్ ఉన్నారు. నటి కీర్తి సురేశ్‌ను కూడా సంస్థ ప్రచారకర్తగా నియమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment