Jose alukkas
-
జోస్ అలుక్కాస్ ‘నిత్యారా’ ఆవిష్కరణ
హైదారాబాద్: జోస్ అలుక్కాస్ ‘నిత్యారా’ పేరుతో కొత్త డైమండ్ కలెక్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వజ్రాభరణాల శ్రేణిని సినీ నటి కీర్తీ సురేష్ ఆవిష్కరించారు. ‘‘అత్యుత్తమ వజ్రాలు, రత్నాలతో నిపుణులైన డిజైనర్లు, ప్రావీణ్యం కలిగిన కళాకారుల ‘నిత్యారా’ ఆభరణాలు రూపొందించారు. చీరలతో మాత్రమే కాకుండా ఆధునిక దుస్తులతో సైతం కలిసిపోయేలా అన్ని ఆధునిక హంగులతో ఆభరణాలు తీర్చిదిద్దారు’’ అని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమంలో జోస్ ఆలుక్కాస్ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ ఆలుక్కా, జాన్ ఆలుక్కా పాల్గొన్నారు. -
జోస్ ఆలుక్కాస్ శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్–2023
చెన్నై: పెళ్లిళ్ల సీజన్‌కు మరింత శోభను చేకూర్చేందుకు జోస్ ఆలుక్కాస్ ‘‘శుభ మాంగళ్యం బ్రైడల్ కలెక్షన్ – 2023 ఫెస్టివ్ ఎడిషన్’’ ను ఆవిష్కరించింది. చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆభరణాల కలెక్షన్‌ను సినీ నటులు కీర్తి సురేశ్, అనార్కలి మారికర్లు ప్రారంభించారు. ఇందులోని ప్రతి ఆభరణాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించామని సంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలపై 4.99% తరుగు చార్జీలు ఆఫర్ చేస్తుంది. వజ్రాభరణాలపై 20%, ప్లాటినం వస్తువులపై 7% డిస్కౌంట్ అందిస్తుంది. ఎస్బీఐ కార్డు, పెళ్లి కోసం బంగారం కొనుగోలుపై 5% ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇప్పటికే ఆభరణాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలు పాల్గొన్నారు -
ప్రపంచ వ్యాప్తంగా జోస్ అలుక్కాస్ భారీ విస్తరణ
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చైన్ జోస్ అలుక్కాస్ రూ.5,500 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా భారీ విస్తరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని ఒక జ్యువెల్లరీ రిటైల్ బ్రాండ్ రానున్న 8 సంవత్సరాల్లో చేపడుతున్న భారీ విస్తరణ కార్యక్రమం ఇదని వివరించింది. నిధులు, రియల్టీ సమకూరితే 4 సంవత్సరాల్లోనే తమ విస్తరణ కార్యక్రమం పూర్తవుతుందని వివరించింది. సంస్థ విస్తరణ ప్రణాళికకు సంబంధించి చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో జోస్ అలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్లు జాన్ అలుక్కా, వర్గీస్ అలుక్కా, చైర్మన్ జోస్ అలుక్కా, నటుడు ఆర్ మాధవన్, కంపెనీ ఎండీ పాల్ అలుక్కా పాల్గొన్నారు. (చిత్రంలో ఎడమ నుంచి). ప్రస్తుతం 50 స్టోర్లను కలిగిన జ్యువెల్లరీ గ్రూప్ గ్లోబల్ అంబాసిడర్‌గా నటుడు మాధవన్ ఉన్నారు. నటి కీర్తి సురేశ్‌ను కూడా సంస్థ ప్రచారకర్తగా నియమించుకుంది. -
జోస్ ఆలుక్కాస్... ప్రత్యేక ఆన్లైన్ ఆఫర్లు
హైదరాబాద్: అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ జ్యువెలరీ గ్రూపుల్లో ఒకటైన జోస్ ఆలుక్కాస్ ప్రత్యేక ఆన్లైన్ సౌలభ్యతను ప్రవేశపెట్టింది. ఈ నెల 26వ తేదీలోపు www.josalukkasonline.com ద్వారా ముందు గా బుక్ చేసుకుని ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. బుక్ చేసుకున్నప్పుడు, అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసినట్లుగా ఒక సర్టిఫికేట్ జారీచేస్తారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత కస్టమర్లు తమ ఆభరణాలను దగ్గరలోని జోస్ ఆలుక్కాస్ షోరూమ్‌లలో తీసుకోవచ్చు. లేదా ఇంటి వద్దే డెలివరీ చేసుకోవచ్చు. బంగారు నగల తరుగుపై 20%, వజ్రాలపై 20% తగ్గింపు సంస్థ ఇస్తున్న ఆఫర్లలో కొన్ని. -
జోస్ ఆలుక్కాస్ ‘ఎన్ఆర్ ఐ ఫెస్ట్’
హైదరాబాద్ : ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ‘ఎన్ఆర్ఐ ఫెస్ట్’ను నిర్వహిస్తోంది. దీనిలో వివిధ నూతన శ్రేణి వజ్రాభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫెస్ట్‌లో ఉంచిన ఆభరణాల ధరలు రూ.5000 నుంచి ప్రారంభమౌతాయని పేర్కొంది. ‘మేము నాణ్యతలో ఎటువంటి రాజీపడం. అత్యున్నత నాణ్యత కలిగిన మా కలెక్షన్లను ఎన్ఆర్ఐలు క చ్చితంగా ఇష్టపడతారు’ అని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా తెలిపారు.